మరోసారి బాలయ్య దర్శకుడితో చిరంజీవి

దశాబ్దాలుగా తెలుగు చిత్ర సీమను ఏలుతున్న నట దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ. తమ కెరీర్ లో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఈ లెజెండరీ యాక్టర్స్.. ఇప్పటికే చాలామంది దర్శకులతో పనిచేశారు. అయితే.. కెరీర్ స్టార్టింగ్ నుంచి వీరిద్దరూ డైరెక్టర్స్ ఎక్సేంజ్ విషయంలో ఫాలో అవుతోన్న స్ట్రాటజీ ఇప్పుడు మరోసారి చర్చల్లోకి వచ్చింది.

80లలో చిరంజీవి, బాలకృష్ణ పోటాపోటీగా సినిమాలు చేశారు. కమర్షియల్ హీరోస్ గా పీక్స్ చూసిన వీరిద్దరితోనూ సినిమాలు చేయడానికి డైరెక్టర్స్ పోటీ పడేవారు. అయితే.. 80లలో ఎక్కువగా వీరితో సినిమాలు చేసిన దర్శకులలో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ వంటి వారు ముందుగా గుర్తుకొస్తారు. వీరిలో రాఘవేంద్రరావు చిరంజీవికి ఎక్కువ హిట్స్ ఇస్తే.. కోడి రామకృష్ణ బాలయ్యకి మెమరబుల్ హిట్స్ అందించాడు. ఇక.. అటు చిరంజీవి, ఇటు బాలకృష్ణ ఇద్దరితోనూ ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడిగా కోదండరామిరెడ్డి పేరును చెప్పొచ్చు.

ఆ తర్వాత చిరు, బాలయ్య ల మధ్య డైరెక్టర్స్ ఎక్సేంజ్ లో బి.గోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బాలయ్య తో ‘సమరసింహారెడ్డి, నరసింహానాయుడు‘ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బి.గోపాల్ తో ఏరికోరి ‘ఇంద్ర‘ సినిమా చేసి తను కూడా ఓ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు మెగాస్టార్. ఇప్పుడు లేటెస్ట్ గా బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి‘ వంటి బడా హిట్ అందించిన అనిల్ రావిపూడితోనూ సినిమాకి సిద్ధమవుతున్నాడట చిరంజీవి.

అనిల్ రావిపూడి కాంబోలో చిరు సినిమాకోసం కొన్ని నెలల నుంచే కసరత్తులు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు వీరిద్దరి కాంబోని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సెట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చిరంజీవి.. వశిష్ట, కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమాలను లైన్లో పెట్టాడు.

వీరిలో వశిష్ట సినిమా శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఒకవేళ అనిల్ రావిపూడి లైన్లోకి వస్తే.. చిరంజీవి సినిమాల ఆర్డర్ లో మార్పులు జరిగినా ఆశ్చర్యం లేదు. మరోవైపు.. బాలకృష్ణ ‘భగవంత్ కేసరి‘ డైరెక్టర్ అనిల్ రావిపూడిని చిరంజీవి లైన్లో పెడితే.. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య‘ డైరెక్టర్ బాబీతో బాలయ్య సినిమా చేస్తుండడం విశేషం.

Related Posts