ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ‘హాయ్ నాన్న’కి అవార్డు!

నేచురల్ స్టార్ నాని, ఛార్మింగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఫస్ట్ టైమ్ కలిసి నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. చైల్డ్ సెంటిమెంట్ తో డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఓ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. థియేట్రికల్ గా, డిజిటల్ దునియాలోనూ సినీ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన ‘హాయ్ నాన్న’ అవార్డుల విషయంలోనూ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.

అంతర్జాతీయంగా ‘హాయ్ డాడ్’గా విడుదలై.. ప్రతిష్టాత్మక ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ మార్చ్ 2024 ఎడిషన్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డును కైవసం చేసుకుంది ‘హాయ్ నాన్న’ చిత్రం. ఈ సినిమా అద్భుతమైన కథనం, ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్, యూనిక్ సినిమాటిక్ విజన్ తో ప్రేక్షకులు, న్యాయనిర్ణేతలను ఆకర్షించింది.

‘ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘హాయ్ నాన్నా’కి ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది’ అన్నారు దర్శకుడు శౌర్యువ్. ‘సాంస్కృతిక సరిహద్దులను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలా కథ చెప్పే శక్తిని ఈ విజయం అందించింది. ఫెస్టివల్ నిర్వాహకులకు, జ్యూరీకి, ‘హాయ్ నాన్నా’కి ప్రాణం పోసిన మా బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము’. అని శౌర్యువ్ అన్నారు.

Related Posts