నాగచైతన్య వాయిస్ ఓవర్ తో ‘డియర్’ ట్రైలర్

ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగానూ దుమ్మురేపుతుంటాడు. ఈ టాలెంటెడ్ మ్యూజిషియన్ కమ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘డియర్’. ఈ సినిమాలో జి.వి.ప్రకాష్ కి జోడీగా ఐశ్వర్య రాజేష్ నటించింది. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా తెలుగు ట్రైలర్ రిలీజయ్యింది.

యువ సామ్రాట్ నాగచైతన్య వాయిస్ ఓవర్ తో విడుదలైన ‘డియర్’ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. లైట్ స్లీపర్ అయిన అబ్బాయికి.. గురకపెట్టే అమ్మాయికి పెళ్లైతే ఎలాగుంటోంది? అనేదే ఈ మూవీ కోర్ కాన్సెప్ట్. ట్రైలర్ అయితే చాలా ఇంప్రెస్సివ్ గా ఉంది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ హీరోగానే కాకుండా సంగీతాన్ని సైతం సమకూరుస్తున్నాడు. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి.పృథ్వీరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘డియర్’ చిత్రం ఏప్రిల్ 12న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts