మిస్ ఇండియాతో అశోక్ రొమాన్స్

గల్లా జయదేవ్ తనయుడు.. మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్ గల్లా రెండో సినిమా హీరోయిన్ గా మిస్ ఇండియా 2020ని తీసుకున్నారు. అశోక్ ఫస్ట్ మూవీ ‘హీరో’ ఆశించినంత విజయం సాధించలేదు. ఇంకా చెబితే ఇలాంటి ఒక సినిమా ఉందన్న విషయం కూడా ఆడియన్స్ కు తెలియకుండా పోయింది.

అయినా సెకండ్ మూవీతో హిట్ కొట్టాలనే కసితో వస్తున్నాడు. ఈ సారి అర్జున్ జంధ్యాల అనే కొత్త దర్శకుడిని నమ్ముకున్నాడు. ఈ చిత్రానికి మరో దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. ఈ సినిమాతో ఓ కొత్త నిర్మాత తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. అతను గతంలో ఓవర్శీస్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు. పేరు సోమినేని భాలకృష్ణ.


ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా 2020లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న మానస వారణాసిని ఎంచుకున్నారు. తన పాత్ర పేరు సత్యభామ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పరిచయం చేశారు. తను ఆల్రెడీ షూటింగ్ లోనే ఉంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం చేస్తున్నాడు. మరి ఈ మూవీతో అశోక్ గల్లా ఎలాంటి విజయం అందుకుంటాడో కానీ.. కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోందట.

Related Posts