సెన్సార్ పూర్తి చేసుకున్న శెట్టి అండ్ శెట్టి

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ కాంబినేషన్ కే టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. దానికి తోడు టైటిల్ ఇంకా అట్రాక్టివ్ గా ఉంది. దీంతో సులువుగానే ఆడియన్స్ అటెన్షన్ ను సంపాదించింది.

రిలీజ్ డేట్ విషయంలో అనేక సందిగ్ధాల తర్వాత ఫైనల్ గా సెప్టెంబర్ 7న ఫిక్స్ అయిపోయింది. మరో వారం రోజుల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు. పి మహేష్‌బాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. ఈ బ్యానర్ లో గతంలో అనుష్క భాగమతి అనే బ్లాక్ బస్టర్ చేసి ఉంది. పైగా అది ప్రభాస్ ఫ్రెండ్స్ కు సంబంధించిన బ్యానర్ కావడంతో డార్లింగ్ కూడా ఆ మధ్య ట్రైలర్ వచ్చినప్పుడు తనకు బాగా నచ్చిందని ట్వీట్ చేసి మూవీ టీమ్ లో ఉత్సాహాన్ని పెంచాడు.


ఇక లేటెస్ట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డ్ నుంచి ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా ట్రైలర్ చూసి చాలామంది క్లీన్ యూ సర్టిఫికెట్ వస్తుందని భావించారు. మరి యూ / ఏ అంటే సినిమాలో ట్రైలర్ లో కనిపించని అంశాలు ఇంకా చాలా ఉన్నాయనే అనుకోవాలి. ఇక ప్రధానంగా నవీన్, అనుష్కలే కనిపిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, మురళీ శర్మ, నాజర్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రధన్ సంగీతం అందించాడు.

ఇక ఎన్నాళ్లుగానో ఊరిస్తోన్న శెట్టి అండ్ శెట్టి ప్రమోషన్స్ కి అనుష్క రావడం లేదు. కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా అటెండ్ కాను అని చెప్పిందట. కామన్ గా ఒక్క ఇంటర్వ్యూ ఇమ్మన్నా కుదరదు అనేసిందట. అంటే తనిప్పుడు ఫిజిక్ పరంగా చాలామారింది. అది ఆడియన్స్ కు తెలియడం ఇష్టం లేకనే ఈ మూవీ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటోంది. అందుకే నవీన్ పోలిశెట్టి ఒక్కడే రెండు రాష్ట్రాలను చుట్టేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నాడు.

Related Posts