మంచి మెలోడీగా.. సుట్టంలా సూసి పోకలా..

“అద్దాల ఓణీలా, ఆకాశవాణీలా.. గోదారి గట్టుపై మెరిశావు మణిలా.. పెద్దింటి దానిలా.. బంగారు గనిలా.. సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా.. కళ ఉన్న కళ్లకే కాటుకేఏలా.. మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా.. సన్నాయి మోతలా.. సందేళ పాటలా.. సందళ్లే తెచ్చావే నీలా.. సుట్టంలా సూసీ పోకలా.. సుట్టేసుకోవే సీరలా.. ” ఈ సాహిత్యం చూస్తే ఓ మంచి పాటలా అనిపిస్తోంది కదూ.. యస్.. విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటిస్తోన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి ఈ పాటకు సంబంధించిన ప్రోమో వచ్చినప్పుడే ఓ మంచి పాట అవుతుందనుకున్నారు చాలామంది.

కొంత గ్యాప్ తర్వాత యువన్ శంకర్ రాజా సంగీతం చేసిన ఈ తెలుగు సినిమా పాట వినగానే ఆకట్టుకునేలా మెలోడీలా ఉంది. పెద్దింటి అమ్మాయితో ప్రేమలో పడ్డ ఓ సాధారణ కుర్రాడి అంతరంగాన్ని ఆవిష్కరించేలా శ్రీ హర్ష ఈమని అందించిన సాహిత్య సహజంగా ఉంటే అంతే సహజంగా ఉంది అనురాగ్ కులకర్ణి వాయిస్. అనురాగ్ పాడిన ఇలాంటి పాటలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ పాటకూ ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.


విశ్వక్ సేన్ ఫస్ట్ టైమ్ గోదారి బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు. 1990ల కాలంలో సాగే కథగా వస్తోన్న ఈ చిత్రాన్ని గేయ రచయిత నుంచి దర్శకుడుగానూ మారిన కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్,ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తోన్న సినిమా ఇది. ఎలా చూసినా ముందు నుంచీ ఈ చిత్రంపై పాజిటివ్ వైబ్స్ పుష్కలంగా ఉన్నాయి. వాటిని రెట్టింపు చేసేలా ఈ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ఉంది. మొత్తంగా విశ్వక్ సేన్ చేస్తోన్న ఈ కొత్త ప్రయత్నం.. సితార బ్యానర్ నుంచి వస్తోన్న మరో బ్లాక్ బస్టర్ లా ఉంది.

Related Posts