మరో పదేళ్లు అల్లు అర్జున్ దే హవా

మెగా ఫ్యామిలీ హీరోగా వచ్చి తనకంటూ తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఆ స్టార్డమ్ వచ్చిన తర్వాత మెగా ట్యాగ్ తీసేసి అల్లు బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో సూపర్ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి.

ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ అంటూ అతనికే సెపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉంది. ఆ బేస్ క్రియేట్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేశాడు అల్లు అర్జున్. అందుకే స్టైలిష్ స్టార్ నుంచి ఐకన్ స్టార్ గా మారిపోయాడు.

పుష్పతో ప్యాన్ ఇండియన్ స్టార్ గానూ తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ క్రేజ్ ను పుష్ప2 డబుల్ చేస్తుందనే అంచనాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. నిజానికి అతనికి ఉన్న ఇమేజ్ కు ఈ తరహా డీ గ్లామర్ రోల్స్ చేయడం సాహసం. ఆ సాహసానికి వచ్చిన ఫలితమే ప్యాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్. అఫ్‌ కోర్స్ అంతకు ముందే అతను దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. కానీ సినిమాతో వచ్చిన ఇమేజ్ వేరు కదా..


ఇక రాబోయే పదేళ్ల పాటు తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ హవా నడవబోతోందట. పైగా పుష్ప2 దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను సాధించి రాబోయే పదేళ్లు అల్లు అర్జున్ హవాకు బీజం వేస్తుందని చెబుతున్నాడు ఓ వ్యక్తి. అతనెవరో కాదు. వేణు స్వామి. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ.. అటు మీడియా ఇంటర్వ్యూస్ తోనూ పాపులర్ అయ్యాడు వేణు స్వామి.

అలాగే జాతక దోషాలు ఉన్న హీరో హీరోయిన్లకు పరిహారాలు కూడా చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో భారీగానే చార్జ్ చేస్తాడనే టాక్ కూడా ఉంది. ఆ వేణు స్వామే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ జాతకం గురించి అడిగినప్పుడు ఈ మాటలు చెప్పాడు. ప్రస్తుతం ఐకన్ స్టార్ కు గోల్డెన్ ఫేజ్ నడుస్తోందట. అతని జాతక ప్రకారం చూసుకుంటే.. రాబోయే పదేళ్లు అతని హవా భారీగా ఉంటుందని చెప్పాడు. తెలుగులో ఇతర హీరోల కంటే అల్లు అర్జున్ కే ఎక్కువ క్రేజ్ వస్తుందన్నాడు.

అతనిపై పది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వంద రూపాయలు ప్రాఫిట్ వస్తుందన్నాడు. ఈ మాటలు నిజమే అయితే ఇక నిర్మాతలకు కాసుల పంటే. మరి ఈ మాటలు కేవలం అల్లు అర్జున్ ప్రాపకం కోసం చెప్పాడా లేక నిజమేనా అని చెప్పలేం కానీ మన హీరో మాత్రం గొప్ప హార్డ్ వర్కర్. ఆ హార్డ్ వర్క్ కు ఎప్పుడూ ఫలితం ఉంటుంది. జాతకాలు దానికి అనుగుణంగా మారుతుంటాయంతే. ఏదేమైనా ఫ్యాన్స్ కు ఈ వార్త మాత్రం మంచి సంతోషాన్ని ఇస్తుందనే చెప్పాలి.

Related Posts