దేవరకోసం ఎన్టీఆర్ తో భారీ సాంగ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా దేవర. ఎన్టీఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు.

ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు ఫస్ట్ సౌత్ కు పరిచయం కాబోతోంది. ఇక విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అతని పాత్ర పేరు భైరా అని లేటెస్ట్ సైఫ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా చెప్పారు. సో సినిమా అంతా దేవర వర్సెస్ భైరాగా సాగుతుందన్నమాట. ఈ భైరా అనేవాడు అత్యంత క్రూరమైన వ్యక్తిగా కనిపిస్తాడట. మరి అతను అంత క్రూరంగా ఉంటేనే కదా.. ఎన్టీవోడి హీరోయిజం డబుల్ అయ్యేది. ఇక ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.


ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరణ జరుపుకుంటోన్న దేవరకు సంబంధించి వచ్చే నెల నుంచి టాకీ పార్ట్ స్టార్ట్ అవుతుందట. దానికి ముందు ఫస్ట్ వీక్ లో ఓ పాటను షూట్ చేయబోతున్నారు. ఈ పాటలో దేవరతో పాటు భైరా కూడా ఉంటాడట. హీరో, విలన్ ఉన్న ఈ పాట కోసం ఏకంగా 500మంది డ్యాన్సర్స్ తో ఓ కొరియోగ్రఫీ చేయించబోతున్నారని టాక్.

ఇప్పటి వరకూ ఎన్టీఆర్ సినిమాల్లో వందకు మించి సైడ్ డ్యాన్సర్స్ కనిపించలేదు. అలాంటిది ఒకేసారి 500మంది అంటే ఆ పాట ఏ రేంజ్ లో ఉంటుందో ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అదే టైమ్ లో ఎన్టీఆర్ స్టెప్పులు కూడా అదిరిపోతాయని టాక్. మొత్తంగా ఇప్పటి వరకూ యాక్షన్ పార్ట్ పూర్తయింది. నవంబర్ కల్లా టాకీపార్ట్ కూడా పూర్తి చేయాలనే టార్గెట్ తోనే కొరటాల శివ దూకుడుగా పనిచేస్తున్నాడు.

నవంబర్ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని ఆపై బాలీవుడ్ మూవీ వార్2లో అడుగుపెడతాడు ఎన్టీఆర్. ఈ మూవీలో ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు. మరి ఈ భారీ మల్టీస్టారర్ ఏమో కానీ.. దేవర కోసం 500 మందితో చిత్రీకరించబోయే భారీ పాట మాత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది.

Related Posts