మహేష్ బాబు నుంచి మరో మల్టీప్లెక్స్

నేటితరం కథానాయకులు రోజుకో కొత్త ఆలోచన చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. కేవలం నటులుగానే కాకుండా.. బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్నారు. కొంతమంది సినిమా ఇండస్ట్రీకి అస్సలు పొంతనలేని బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతుంటే.. మరికొంతమంది సినీ ఇండస్ట్రీకి అనుబంధమైన వ్యవస్థల్లో తమ డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ కోవలో.. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ ఫిల్మ్స్ తో కలిసి థియేటర్స్ చెయిన్ ను ప్రారంభించాడు. ఎ.ఎమ్.బి. పేరుతో హైదరాబాద్ గచ్చిబౌళిలో మహేష్ మొదలుపెట్టిన మల్టీప్లెక్స్ కి మంచి క్రేజుంది.

ఇప్పుడు ఎ.ఎమ్.బి. చెయిన్ ను మరింత ముందుకు తీసుకెళుతున్నాడు. హైదరాబాద్ లో థియేటర్స్ కు అడ్డాగా నిలిచే ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ లో ఎ.ఎమ్.బి. క్లాసిక్ పేరుతో మరో మల్టీప్లెక్స్ ను తీసుకొస్తున్నారు. ఏషియన్ తో కలిసి మహేష్ బాబు మొదలుపెడుతున్న ఈ ఎ.ఎమ్.బి. క్లాసిక్ లో ఏడు స్క్రీన్స్ ఉంటాయట. ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 70 ఎమ్.ఎమ్. స్థానంలో ఈ మల్టీప్లెక్స్ రాబోతుంది.

Related Posts