సినిమాపై విపరీతమైన ఫ్యాషన్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన నిర్మాతల్లో అనిల్ సుంకర ఒకరు. ‘నమో వెంకటేశా, దూకుడు, లెజెండ్, సరిలేరు నీకెవ్వరు‘ వంటి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు అనిల్. అయితే.. ‘మహా సముద్రం, ఏజెంట్, భోళా శంకర్‘ వంటి వరుస ఫ్లాపులు తన ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ ను బాగా ఇబ్బంది పెట్టాయి. లేటెస్ట్ గా రిలీజైన ‘ఊరు పేరు భైరవకోన‘ చిత్రం అనిల్ సుంకర ను మళ్లీ సక్సెస్ రూటులో నిలబెట్టింది.
అందుకే.. ‘ఊరు పేరు భైరవకోన‘ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ తోనే తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశారు అనిల్ సుంకర. ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నెం 27 గా ఈ చిత్రం రూపొందనుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ క్రేజియెస్ట్ మెగా బడ్జెట్ మూవీగా ఇది తెరకెక్కనుందట. ఈ సినిమాకి కూడా రాజేష్ దండా, అజయ్ సుంకర సహ నిర్మాతలుగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా‘ చిత్రానికి డైలాగ్స్ అందించిన అబ్బూరి రవి కొత్త సినిమాకు కూడా పని చేయనున్నారట. అయితే.. అనిల్ సుంకర నిర్మాణంలో వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కే మెగా బడ్జెట్ మూవీలో హీరో ఎవరనేదే? సస్పెన్స్ గా మారింది.
అయితే.. ‘భోళా శంకర్‘ డిజాస్టర్ కావడంతో అనిల్ సుంకర నిర్మాణంలో మరో చిత్రాన్ని చేస్తానని మాటిచ్చాడట మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా చిరంజీవితోనే వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనుందనే ప్రచారమూ ఉంది. ఏదేమైనా.. త్వరలోనే అనిల్ సుంకర మెగా బడ్జెట్ మూవీలో హీరోపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది