మనోభావాలు దిబ్బతీసే పాట వచ్చేసింది

సినిమా విడుదలకాకుండానే.. ఆ చిత్రంలో ఉండాల్సిన ఒక పాటను తీసేసిన సంఘటన ‘మంగళవారం’ చిత్రంలో జరిగింది. ఈ సినిమాలో ‘అప్పడప్పడ తాండ్ర’ పాటలో చాలా మంది మనోభావాలు దెబ్బతీసేలా లిరిక్స్ ఉన్నాయని సెన్సార్ సభ్యులు చెప్పడంతో ఈ పాటను సినిమా నుంచి తొలగించారు. అయితే.. ‘అప్పడప్పడ తాండ్ర’ ఫుల్ వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు.

‘కాంతర, విరూపాక్ష’ ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇక.. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాటలోని లిరిక్స్ అభ్యంతర కరంగానే ఉన్నాయి. ఎక్కువగా వాళ్లకు, వీళ్లకు అక్రమ సంబంధాలకు సంబంధించిన పదాలతో పాట అంతా నిండిపోయింది. అయితే.. డైరెక్టర్ అజయ్ భూపతి ఈ పాటను చిత్రీకరించిన విధానం బాగుంది. మందు బాబులంతా ఓ చోటుకి చేరి చేసే సందడి ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సాంగ్ కి హైలైట్.

‘ఆర్.ఎక్స్.100’ తర్వాత అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కాంబోలో వస్తోన్న సినిమా ‘మంగళవారం’. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నవంబర్ 17న విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts