అల్లు అర్జున్ – త్రివిక్రమ్ అనౌన్స్ చేశారు.. కథేంటో తెలుసా..?

అల్లు అర్జున త్రివిక్రమ్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరి కాంబోలో ఆల్రెడీ వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో ఒకదాన్ని మించి ఒకటి విజయం సాధించాయి. అందుకే వీరిది టాలీవుడ్ లోనే క్రేజీ కాంబోగా చెబుతాం.

అలాంటి కాంబోలో మరో సినిమా అనౌన్స్ అయింది. హారిక హాసినితో పాటు అల్లు అర్జున్ బ్యానర్ కూడా కలిసి నిర్మించబోతోన్న ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గానే అనౌన్స్ అయింది.

ఇప్పటి వరకూ చూసిన దానికంటే చాలా బిగ్గర్ మూవీని ఎక్స్ పెక్ట్ చేయమని ప్రిపేర్ చేస్తూ ఈ అనౌన్స్ మెంట్ కనిపిస్తోంది. ఈ కాంబోలో మరో సినిమాగురించి చాలా రోజులుగా వింటున్నారు. అయితే మహేష్‌ బాబుతో త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత అనౌన్స్ చేస్తారు అనుకున్నారు. ఆ సినిమా అనుకున్నంత త్వరగా పూర్తి కావడం లేదు. దీంతో వీళ్లు మాత్రం అనుకున్న టైమ్ లోనే ప్రకటన చేశారు.

ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప2 షూటింగ్ లో ఉన్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సమ్మర్ లో లేదా సంక్రాంతి బరిలో విడుదల చేస్తారు అని చెబుతున్నారు. ఇటు మహేష్‌ – త్రివిక్రమ్ గుంటూరు కారం కూడా సంక్రాంతికే విడుదల కాబోతోంది.


ఇక అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కథ గురించి ఒక విశ్వసనీయమైన విషయం తెలుస్తోంది. వీరి కాంబోలో వచ్చే ఈ నాలుగో సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో ఉంటుందట. మామూలుగా.. అనగనగా ఒక రాజు.. అని చెప్పే ఏ కథైనా ఆ బాలగోపాలాన్ని అలరిస్తుంది.

అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకూ ఆసక్తిగా వింటారు.. చూస్తారు. ఎందుకంటే దీంట్లో ఎన్ని వింతలు విశేషాలూ ఉంటాయో.. అన్ని సాహసాలు, ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలూ ఉంటాయి. ఇక మాయలు మంత్రాలు సరే సరి. అందుకే ఈ తరహా కథలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ గురించి బాగా తెలిసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

పైగా అతనికి పురాణాలపై తిరుగులేని పట్టు ఉంది. అన్ని విషయాలూ కూలంకషంగా మాట్లాడగలడు. అలాంటి దర్శకుడు ఓ సోషియో ఫాంటసీ చిత్రం తీస్తే ఎలా ఉంటుంది..? యస్.. అల్లు అర్జున్ మాత్రమే కాదు.. త్రివిక్రమ్ కూడా ఇప్పటి వరకూ ఈ జానర్ సినిమా చేయలేదు. అలాంటి ఇద్దరూ కలిసి ఫస్ట్ టైమ్ సోషియో ఫాంటసీ అంటే ప్యాన్ ఇండియన్ రేంజ్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంటుందని వేరే చెప్పాల్సిన పనిలేదు.

Related Posts