ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేర్ రికార్డ్ క్రియేట్ చేశాడు.సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఆయన ఫ్యాన్స్ కూడా అదే జోష్ తో ఉంటారు. తన కొత్త సినిమాల అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ ఫోటోస్, పర్సనల్ ఫోటోస్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు అల్లు అర్జున్.
అప్పుడప్పుడూ కూతురుతో ఆడుకున్న వీడియోస్ సైతం వస్తుంటాయి. ఇలాంటివి క్షణాల్లోనే వైరల్ అయిపోతుంటాయి.ఇప్పటికే సౌత్ లో ఏ స్టార్ కు లేనంత ఫాలోవర్స్ అల్లు అర్జున్ కు ఉన్నారు. అయితే ఈ మధ్యే వచ్చిన ఓ కొత్త యాప్ లో అతని ఫాలోవర్స్ సంఖ్య ఒన్ మిలియన్ కు చేరుకుంది.
ఈ మధ్య ట్విట్టర్ వాడు ఎప్పుడు పడితే అప్పుడు ఆ యాప్ ను డిస్ట్రబ్ చేస్తూ.. యూజర్స్ తో ఆడుకుంటున్నాడు.ఈ విషయంపై ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ పై విపరీతంగా అదే ప్లాట్ ఫామ్ లో విమర్శలు కూడా వస్తుంటాయి. అయితే ట్విట్టర్ కు పోటీగా మెటా టీమ్ నుంచి కొత్తగా ట్విట్టర్ లాంటి మరో యాప్ ను క్రియేట్ చేశాడు.
దాని పేరు థ్రెడ్స్. ఈ యాప్ వచ్చీ రాగానే చాలామంది సెలబ్రిటీస్ కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారు. అసలే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఐకన్ స్టార్ చేయకుండా ఉంటాడా..? ఆ యాప్ లో అతన్ని ఇప్పుడు అక్షరాలా పదిలక్షల మంది ఫాలో అవుతున్నారు. థ్రెడ్స్ లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న ఏకైక ఇండియన్ యాక్టర్ అల్లు అర్జున్. అదీ రికార్డ్.
ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కు ఇన్ స్టాగ్రామ్ లో 21మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్ లో 7.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్ పరంగా ఈ రికార్డ్ కూడా అతని పేరుమీదే ఉంది. తాజాగా థ్రెడ్స్ లో రికార్డులు మొదలుపెట్టాడన్నమాట.