చంద్రముఖి2.. ఈ సారి వణికిస్తారట

చంద్రముఖి.. 2005లో వచ్చిన సినిమా. రజినీకాంత్, జ్యోతిక, ప్రభు, నయనతార, వడివేలు,అవినాష్, వినీత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా. ఎంటర్టైనింగ్ గా ఉంటూనే చంద్రముఖి అనే ఆత్మతో కూడిన సన్నివేశాలు అప్పట్లో తెగ భయపెట్టాయి.

ముఖ్యంగా జ్యోతిక నటనకు జనం రాత్రుళ్లు సినిమా చూసి ఇంటికి వెళ్లాలన్నా.. భయపడ్డారు. రజినీకాంత్ ఛరిష్మాటిక్ యాక్టింగ్, వడివేలు కామెడీ మరో హైలెట్ గా ఉంటుంది. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ అంటున్న నయనతారకు ఇది ఫస్ట్ బ్రేక్.అయితే ఈ మూవీ అంతకు ముందు 1993లో మళయాలంలో వచ్చిన మణిచిత్రతాళు అనే సినిమాకు రీమేక్.

మాగ్జిమం పాయింట్ ను తీసుకుని రజినీకాంత్ ఇమేజ్ కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి పి వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీనికి కొనసాగింపుగా నాగవల్లి అనే సినిమా వచ్చినా అది ఆకట్టుకోలేదు. ఇప్పుడు పి వాసు దర్శకత్వంలోనే చంద్రముఖి2 రాబోతోంది. ఈ సారి రాఘవలారెన్స్ తో పాటు కంగనా రనౌత్ నటించింది.


ఈ సెప్టెంబర్ 19న చంద్రముఖి విడుదల కాబోతోంది.ఈ సారి ఓ కొత్త ఎక్స్ పర్మెంట్ చేశాడు దర్శకుడు వాసు. తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కాబోతోన్న ఈ మూవీకి మూడు భాషల్లోనూ ముగ్గురు సంగీత దర్శకులతో నేపథ్య సంగీతం చేయించాడు. తెలుగు వెర్షన్ కు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం ఇచ్చాడు.ఈ మూవీ రీ రికార్డింగ్ కోసం రెండు నెలల పాటు రాత్రుళ్లు చాలా కష్టపడ్డాడట కీరవాణి.తను మ్యూజిక్ చేస్తున్నప్పుడే చాలా భయపడిపోయానని