మంగళవారం రోజు బలే సర్ ప్రైజ్ ఇచ్చాడే

ఫస్ట్ మూవీతో బెస్ట్ హిట్ కొట్టడం అనేది ఏ దర్శకుడైనా ది బెస్ట్ మెమరీగా ఉంటుంది. ఆర్ఎక్స్ 100తో ఆ మెమరీని దాచుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. అయితే ఈ విజయాన్ని కంటిన్యూ చేయడమే కత్తిమీద సాములాంటిది. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. రెండో సినిమాగా చేసిన మహా సముద్రం డిజాస్టర్ అనిపించుకుంది.

పైగా క్రేజీ కాస్టింగ్ తో వచ్చాడు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరి, అనూ ఇమానుయేల్, జగపతి బాబు అంటూ బిగ్ కాన్వాస్ లోనే వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆర్ఎక్స్ 100 తర్వాత అనేక ఆఫర్స్ అందుకున్న అతను ఈ మూవీ ఫ్లాప్ తో ఒక్కసారిగా వెనకబడ్డాడు. అందుకే మూడో సినిమాకు బాగా లేట్ అయింది. అయినా తనే రిస్క్ తీసుకుని ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి మంగళవారం అనే సినిమాతో రాబోతున్నాడు. మరోసారి ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నే నమ్ముకుని తీస్తోన్న ఈ మూవీ టీజర్ విడుదలైంది.


మంగళవారం అనే టైటిల్ తోనే ఆకట్టుకున్నాడు అజయ్ భూపతి. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా బావున్నాయి. ఇక ఈ టీజర్ చూస్తే ఈ సారి డిఫరెంట్ జానర్ ట్రై చేసినట్టు కనిపిస్తున్నాడు. టీజర్ మొత్తం ఓ సస్పెన్స్ ను మెయిన్టేన్ చేశాడు. ఆ సస్పెన్స్ తో పాటు కాస్త హారర్ కూడా మిక్స్ అయినట్టు కనిపిస్తోంది. దీనికి తోడు పాయల్ ఇమేజ్ ను వాడుతూ ఆ బోల్డ్ నెస్ ను కూడా చూపించాడు. టీజర్ చూస్తుంటే ఒక ఊరిలో జరిగే కథలా కనిపిస్తోంది.

ఆ ఊరికి సంబంధించి మంగళవారం రోజు ఏదో జరుగుతూ ఉంటుంది. అదేంటీ అనేదే పాయింట్. ఆ పాయింట్ ను ఆసక్తికరంగానే చెప్పబోతున్నాడు అనేలా ఉంది టీజర్. టీజర్ కోసం కట్ చేసిన షాట్స్ బావున్నాయి. విజువల్ గా సూపర్బ్ అనిపించుకుంటోంది. ఆర్టిస్ట్ ల సెలెక్షన్ కూడా బావుంది. చివర్లో పాయల్ ను చూపించినా.. మేల్ లీడ్ ఎవరనేది మాత్రం తేల్చలేదు. మొత్తంగా హారర్ నేపథ్యంలో ఓ బోల్డ్ స్టోరీ చెప్పబోతున్నాడు అనేలా ఉంది ఈ మంగళవారం టీజర్.

Related Posts