112 రూపాయలకే ఆదిపురుష్‌

ఆదిపురుష్‌.. ఓ పీడకల. తీసిన వారికే కాదు. అందులో నటించిన వారికి కూడా. ఇప్పటి వరకూ వచ్చిన రామాయణ గాథలకు పూర్తి భిన్నంగా.. హిందువులకు కూడా ఆమోదయోగ్యం కాని రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ఓమ్ రౌత్. మొదటి మూడు రోజులు ఫర్వాలేదు అనిపించినా.. తర్వాత ఒక్కసారిగా కలెక్షన్స్ కుప్పకూలిపోయాయి.

మళ్లీ ఏ దశలోనూ పికప్ కాలేదు. పైగా మొదటి మూడు రోజులు ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. విపరీతంగా టికెట్ రేట్లను కూడా పెంచుకున్నారు. సోమవారం నుంచి కాస్త రేట్లు తగ్గాయి. అయినా కలెక్షన్స్ పెరగలేదు. దీంతో ఒకప్పటి రేట్లే అని బోర్డ్ లు పెట్టారు. ఇప్పుడు అది కూడా పోయింది. ఆదిపురుష్ సెకండ్ వీక్ కు వచ్చేసరికి ఏదో బంపర్ ఆఫర్ సేల్స్ పెట్టినట్టుగా టికెట్ రేట్స్ ను ఓ రేంజ్ లో తగ్గించారు.


ఈ సోమవారం నుంచి ఆదిపురుష్ త్రీడీ టికెట్ ధర కూడా కేవలం 112 రూపాయలే. మామూలుగా ఈ రేట్ సింగిల్ స్క్రీన్స్ లోనే 150 రూపాయలు ఉంటుంది. దానికి త్రీ డీ గ్లాస్ అదనం. అయినా వీళ్లు త్రీ డీ గ్లాస్ తో కలిపి 112 అంటున్నారు అంటే ఆదిపురుష్‌ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. అయితే వీళ్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. సినిమాకు సంబంధించి చాలామంది హర్ట్ అయ్యారు.

అంతే తప్ప టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయనో లేక మరో కారణం వల్లో కలెక్షన్స్ తగ్గలేదు. రామాయణాన్ని ఇంత దారుణంగా తీస్తారా అంటూ చూడని వాళ్లు కూడా చూసిన వాళ్లు చెప్పేదానికి కనెక్ట్ అయిపోతున్నారు. తెలుగులో చాలామంది అయితే ఏకంగా ఒకప్పటి పాత సినిమాలను మరోసారి చూసి తరిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. మరి 112 రూపాయల ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందనేది ఊహించేదే. అయినా వీరి ప్రయత్నానికి ఎలాంటి ఫలితం వస్తుందో చూద్దాం.

Related Posts