అందం, చందం ఉన్న ఆటంబాంబ్ లాంటి పిల్ల

ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన సినిమా ఉస్తాద్. కొన్నాళ్లుగా హీరోగా రాణించాలని.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న శ్రీ సింహా గత వారం కూడా భాగ్ సాలే అనే సినిమాతో వచ్చాడు.

బట్ ఈ మూవీ చూసి ఆడియన్స్ పరుగులు తీశారు. అయినా పెద్దగా గ్యాప్ లేకుండా ఇప్పుడు ఉస్తాద్ అంటూ వస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన వస్తోన్న ప్రతి అప్డేట్ ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ఆ మధ్య వచ్చిన పాటలు బలే ఉన్నాయనిపించుకున్నాయి.

తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు. శ్రీ సింహా సరసన బలగం భామ కావ్య కళ్యాణ్‌ రామ్ నటించింది. అకీవా బి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఈ గీతాన్ని రెహ్మాన్ రాయగా.. కార్తీక్ పాడాడు. కంప్లీట్ మాంటేజ్ సాంగ్ లా ఉన్న ఈ సాంగ్ చూస్తే.. తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్న సామెతకు మరో రూపంలా ఉంది.


ఉస్తాద్ కు సంబంధించి విశేషం ఏంటంటే.. వీళ్లు మొదటి నుంచి పాటంటే పాట మాత్రమే కాదు. దానికి ముందున్న సన్నివేశాన్ని కూడా విడుదల చేస్తున్నారు. పైగా అవన్నీ చాలా క్యూట్ గా.. వెరీ ఇంప్రెసివ్ గా ఉండటంతో ఆటోమేటిక్ గా పాట మరింత బాగా నచ్చేస్తుంది. ఇప్పుడు కూడా కాలేజ్ బస్ లో హైదరాబాద్ కు బయలుదేరిన అమ్మాయి.. తన వద్ద అప్పు ఉన్న హీరోను ఆ డబ్బులు ఇమ్మని డిమాండ్ చేస్తుంది. అతనేమో బొలేరో వాహనంలో ఏవో సరుకులు రవాణా కోసం హైదరాబాద్ వెళుతుంటాడు. అతను డబ్బులు ఇవ్వలేడు అని తెలిసే అడుగుతుంది. అతను కాదు అంటే.. తనకు ఈ వెహికిల్ లో లిఫ్ట్ ఇమ్మంటుంది. మరి తన కాలేజ్ బస్ ఉన్నా.. ఈ కుర్రాడితోనే ప్రయాణం చేయాలనుకుంటుందంటే ఆ అమ్మాయి మనసులో ఏముందో అర్థం కావడం లేదూ.. ఇక పాటలోని సాహిత్యం సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి.

ఈ తరహా ఆడవారి మాటలకు అర్థాలే వేరు అమ్మాయిలను బాగా డిస్క్రైబ్ చేశాడు రెహ్మాన్. ముఖ్యంగా ఆ అమ్మాయి గుణం గురించి చెబుతూ.. ” చెయ్యే పట్టి లాగేస్తుంది చల్ చల్ నాతో అంటూ.. చెయ్యే వస్తే తోసేస్తుంది హద్దే దాటొద్దంటూ.. పై పైకల ఉరుముల ఉరుముతు.. లో లోపల మనసును తడుపుతు నా దారిలో చేరిన మేఘము తానే..” అనే పదాలు బలే ఉన్నాయి. తానుగా వస్తుంది.

అతనే వెళుతే నో అంటుంది. అతనంటే ఇష్టమే. ఆ మాట అతను చెబితే కష్టం. అందుకే సింపుల్ గా ఒకే మాటలో ఆమె గురించి అందం, చందం ఉన్న ఆటంబాంబ్ లాంటి పిల్ల అంటూ తేల్చాడు. ఇలాంటి గుణం ఉన్న అమ్మాయిగా కావ్యకళ్యాణ్‌ రామ్ కూడా బాగా నటించినట్టు కనిపిస్తోంది. మొత్తంగా పాటలతో ఉస్తాద్ వరుసగా మంచి ఇంప్రెషన్‌ వేస్తుంది. మరి కంటెంట్ ఎలా ఉంటుందో కానీ.. ఈ పాటైతే విజువల్ గానూ బాగా ఉండేలా ఉంది.

Related Posts