ప్రాజెక్ట్ కే ప్రభాస్ లుక్.. ఒరిజినలేనా..

ప్రాజెక్ట్ కే.. ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ ను మించి అనేలా ఉంటుందని ముందు నుంచీ ఓభారీ హైప్ ఉంది. అందుకు తగ్గట్టుగానే మేకింగ్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు దర్శకుడు నాగ్అశ్విన్. అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల యూఎస్ఏలో విడుదలైంది. గురువారం ఇండియాలో విడుదల కాబోతోంది. దీనికి ముందు ప్రాజెక్ట్ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

అంతా ఊహించినట్టుగానే ఆయన సూపర్ మేన్ తరహా లుక్ లో ఉన్నాడు. ఒళ్లంతా ఒక షీల్డ్ తో కప్పబడి ఉంది. ఒత్తైన జుత్తు, గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు ప్రభాస్. ఈ లుక్ చూస్తోంటే మరో గ్రహంలో ఓ యాక్షన్ సీన్ కు సంబంధించిన ఫోటో లా ఉంది. అతని చుట్టూ యుద్ధ శకలాల్లాంటి మెటీరియల్స్ కనిపిస్తున్నాయి.
కాకపోతే ఈ పోస్టర్ మాత్రం అంచనాలను అందుకోలేదు అనే చెప్పాలి.

ఈ తరహా లుక్స్ ఆల్రెడీ హాలీవుడ్ నుంచి చాలా సినిమాల్లో ఉన్నాయి. ఇది ఇండియన్ వెర్షన్ కాబట్టి ఇంకేదైనా ప్రత్యేకంగా ఉంటుందని ఆశించిన వారికి హండ్రెడ్ పర్సెంట్‌ శాటిస్ ఫై చేసేలా ఈ లుక్ లేదనే చెప్పాలి. ఇంకా చెబితే ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా ఉంది తప్ప మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేసినట్టుగా లేదు. మరి గ్లింప్స్ తో ఇంకేదైనా స్పెషాలిటీ చూపిస్తారేమో కానీ.. ఈ ఫస్ట్ లుక్ మాత్రం ఆశించినంత గొప్పగా లేదనే చెప్పాలి.

Related Posts