రవితేజ తర్వాత లైన్లో ఉన్న వరుణ్ తేజ్?

తెలుగు హీరోల సినిమాలకు నార్త్‌లో సూపర్ క్రేజుంది. మన కథానాయకుల హిందీ డబ్బింగ్ వెర్షన్స్‌ కి యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. అక్కడ హిందీ ఛానెల్స్ లో మన డబ్బింగ్ మూవీస్ దే హవా. అందుకే.. మన సినిమాలను కోట్లకు కోట్లు పెట్టి హిందీ డబ్బింగ్ రైట్స్ కొనేవారు. అలాగే.. కోవిడ్ తర్వాత ఓటీటీ రూపంలో మరో ఆదాయ వనరు వచ్చింది. అందుకే తెలుగులో చాలామంది మిడ్ రేంజ్ హీరోస్ తమ పారితోషికాలను అమాంతం పెంచేశారు. కానీ ఇప్పుడు సమీకరణాలు మారాయి.

గత కొన్ని రోజులుగా ఓటీటీ ఆదాయం తగ్గింది. అలాగే.. హిందీ డబ్బింగ్ రైట్స్ కొనే వాళ్లు తగ్గారు. ఈ నాన్-థియేట్రికల్ రైట్స్ భారీగా తగ్గడంతో కొంతమంది హీరోల మార్కెట్ భారీగా పతనమైంది. దానికి వాళ్లు వరుస ఫ్లాపుల్లో ఉండడం కూడా కారణం. ఈ నాన్-థియేట్రికల్ ఎఫెక్ట్ ముఖ్యంగా రవితేజాపై పడిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో రవితేజా సినిమాలకు భారీగా ఆదాయం వచ్చేది. అందుకే.. తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశాడు మాస్ మహారాజ. కానీ.. ఇప్పుడు ఆ ఆదాయం తగ్గడంతో తన మార్కెట్ పరిధి కూడా దక్కింది. బడ్జెట్ భారీగా పెరుగుతుంది అనే ఉద్దేశ్యంతోనే గోపీచంద్ మలినేనితో రవితేజా చేయాల్సిన ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టిందట మైత్రీ మూవీ మేకర్స్.

వరుణ్ తేజ్ ‘మట్కా’ విషయంలో ఇదే జరుగుతుందంటున్నారు. వరుణ్ హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే.. బడ్జెట్ మార్కెట్ పరిధిని దాటుతుండడంతో నిర్మాతలు పునరాలోచనలో పడ్డారట.

Related Posts