టిల్లు నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు.. కారణ జన్ముడు – టిల్లు స్క్వేర్‌ ట్రైలర్‌ హంగామా

సిద్దు జొన్నలగడ్డ స్టార్‌బోయ్‌గా ఇమేజ్‌ తెచ్చిపెట్టిన మూవీ ‘డిజె టిల్లు’. ఈ సినిమా సీక్వెల్‌ టిల్లు స్క్వేర్‌ రిలీజ్‌ కి రెడీ అయ్యింది. రాధికగా నేహాశెట్టి ఎంత ఎంటర్‌టైన్ చేసిందో.. ఇప్పుడు సన పాత్రలో అనుపమ అంతకుమించి అనేలా బోల్డ్ అటెంప్ట్ చేసింది. సిద్దు , అనుపమ ల టిల్లు స్క్వేర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫస్ట్‌ పార్ట్‌కంటే డబుల్ డోస్ అనిపించేలా ట్రైలర్‌ రిలీజ్ చేసారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్‌ చేసిన టిల్లు స్క్వేర్‌ ట్రైలర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

మల్లిక్‌రామ్‌ డైరెక్షన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ నిర్మించిన టిల్లు స్క్వేర్‌లో సిద్దుకే ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ బాడీలాంగ్వేజ్‌తో సీక్వెల్‌ ట్రైలర్‌ శ్రీరాములు ధియేటర్‌ (హైదరాబాద్) లో రిలీజ్‌ చేసారు. అనుపమ ఇంతకు ముందున్న ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా కంప్లీట్‌ పోష్‌ లుక్‌లో అద్దరగొట్టేస్తుంది.
టిల్లు నార్మల్‌ హ్యూమన్‌ బీయింగ్ కాదు.. కారణజన్ముడు.. లోకంలోని లేడీస్‌ గలీజ్‌ పంచాయితీలన్నీ నెత్తికి తగిలించుకునే ఉత్తమ పౌరుడు అని అర్ధమొచ్చేలా సిద్దు స్పెషల్ డైలాగ్‌ డెలివరీతో.. సూపర్బ్ ఎంటర్‌టైన్ చేయబోతున్నాడు టిల్లుస్క్వేర్‌.

రామ్‌ మిరియాల సాంగ్స్, థమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్‌. టిల్లు స్క్వేర్‌ మార్చి 29 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది.

Related Posts