‘రాజా సాబ్’ కోసం ప్రభాస్ వేసే స్టెప్పులు అదుర్స్!

తెలుగు సినిమా అంటే మిగతా ఇండస్ట్రీల వారికి ముందుగా గుర్తొచ్చే అంశాలు ఫైట్స్, సాంగ్స్. కమర్షియల్ అంశాలకు పెద్ద పీట వేసే మన మేకర్స్.. మన హీరోల చేత వీరలెవెల్లో యాక్షన్ చేయిస్తూనే.. ఊర మాస్ స్టెప్పులతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఉంటారు. వీటిలో ఫైట్స్ లో చెలరేగిపోతున్న ప్రభాస్.. డ్యాన్సుల్లో మాత్రం ఫ్యాన్స్ కు కొన్నేళ్లుగా నిరాశను మిగులుస్తున్నాడు. ప్రభాస్ నుంచి అసలు సిసలు డ్యాన్స్ నంబర్స్ వచ్చి చాలా కాలమైంది.

టాలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోలతో పోల్చుకుంటే ప్రభాస్ డ్యాన్సుల్లో వీకే. కానీ.. ‘ఛత్రపతి, మిర్చి’ వంటి కొన్ని చిత్రాల్లో ప్రభాస్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ‘రాజా సాబ్’తో ప్రభాస్ లోని రొమాంటిక్ యాంగిల్ ను బయటకు తీస్తున్న మారుతి.. ఈ సినిమాలో రెబెల్ స్టార్ తో అదిరిపోయే స్టెప్పులు వేయిస్తున్నాడట. ఈ మూవీలో మొత్తంగా నాలుగు డ్యూయెట్స్ ఉంటాయట. వీటిలో మూడు పాటలు.. ముగ్గురు హీరోయిన్స్ తో ఉంటే.. నాల్గవ సాంగ్ ఐటం నంబర్ గా ఉంటుందట. ఇక.. ఈ నాలుగు పాటల్లోనూ ప్రభాస్ వేసే మాస్ స్టెప్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తాయంటున్నారు. ఇప్పటికే వీటిలో రెండు పాటలను సిద్ధం చేశాడట మ్యూజిక్ డైరెక్టర్ తమన్.

Related Posts