ఆ.. రెండు ప్రాజెక్ట్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన స‌మంత‌

స‌మంత‌.. ఇప్పుడు బాగా వార్త‌ల్లో ఉన్న పేరు. నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత ఆమె కెరీర్ ఎలా ఉంటుందో..? అనుకున్నారు. అయితే… విడాకులు అనే షాకింగ్ నుంచి చాలా త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డింది స‌మంత‌. వెంట‌నే..వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. కెరీర్ లో దూసుకెళుతుంది. అయితే… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప సినిమాలో ఊ.. అంటావా మావ‌.. అనే సాంగ్ చేయ‌డం.. ఆ సాంగ్ సూప‌ర్ స‌క్స‌స్ అవ్వ‌డం తెలిసిందే. దీంతో ఈ అమ్మ‌డు ఇమేజ్ మ‌రింత పెరిగింది.

వ‌రుస‌గా బ‌డా ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటుంది. ఫ్యామిలీమ్యాన్ 2 వెబ్ సిరీస్ పుణ్యమా అని జాతీయ స్థాయిలో స‌మంత‌కు పేరుప్రఖ్యాతులు.. వచ్చిన ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే.. మరో వెబ్ సిరీస్ కు ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ లక్కీ ఛాన్సును ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లు రాజ్ అండ్ డీకేలకు లభించిందని గ‌త కొన్ని రోజులుగా వార్తలు వ‌చ్చాయి.

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క‌న్ ఫ‌ర్మ్ అయ్యింద‌ని టాక్ వినిపిస్తోంది. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ నిర్మాణ సంస్థలు సైతం సమంతను తమ ప్రాజెక్టుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ తో సమంత చర్చలు జరుపుతున్నరని.. వారి ప్రాజెక్టు కోసం సామ్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి సంబంధించి అఫిషియ్ అనౌన్స్ మెంట్ త్వ‌ర‌లో రానుంద‌ని స‌మాచారం. మొత్తానికి.. విడాకుల త‌ర్వాత కెరీర్ లో మ‌రింత స్పీడుతో దూసుకెళుతుండ‌డం విశేషం.

Related Posts