సంజయ్ లీల భన్సాలీ ‘లవ్ అండ్ వార్’

బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ కొత్త సినిమాని ప్రకటించాడు. అసలు సంజయ్.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ తో సినిమా చేస్తాడని భావించారు. కానీ.. రణ్ బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ లతో ‘లవ్ అండ్ వార్’ అంటూ ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీని అనౌన్స్ చేశాడు. ఇంతకుముందు రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనె లతో వరుస సినిమాలను తెరకెక్కించాడు భన్సాలీ. ఆ తర్వాత వారిద్దరూ రియల్ లైఫ్ కపుల్ గా మారారు.

ఇప్పుడు మరో రియల్ లైఫ్ కపుల్ రణ్ బీర్, అలియాలతో సినిమా చేస్తున్నాడు. తానే హీరోగా పరిచయం చేసిన రణ్ బీర్ కపూర్ తో 15 ఏళ్ల గ్యాప్ తర్వాత సంజయ్ చేస్తున్న సినిమా ఇది. అలాగే.. అలియాతోనూ ‘గంగూ భాయ్ కతియవాడి’ తెరకెక్కించి ఘన విజయాన్ని సాధించాడు. రణ్ బీర్, అలియాలతో పాటు విక్కీ కౌశల్ ను మరో ప్రధాన పాత్రలో ఎంపిక చేసుకుని ‘లవ్ అండ్ వార్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాని 2025 క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు.

Related Posts