పూనమ్ పాండే డెత్.. ప్యూర్ పబ్లిసిటీ స్టంట్

బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే మరణించిందనే వార్త నిన్నంతా సినీ ప్రియులను షాకింగ్ కి గురి చేసింది. పూనమ్ చనిపోయిందని ఆమె సోషల్ మీడియా పేజ్ లోనే రావడంతో అంతా నిజమని నమ్మారు. అయితే.. తాను చనిపోలేదని.. ప్రపంచంలో సర్వైకల్ క్యాన్సర్ తో ఎంతోమంది మహిళలు చనిపోతున్నారని.. వారిలో అవగాహన కోసమే తాను అలా చేశానని చెబుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

అయితే.. పూనమ్ మెస్సేజ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించాలంటే దానికి వేరే మార్గాలున్నాయని.. చనిపోయానని అబద్దం చెప్పడం ఎందుకని పూనమ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొంతమంది ఇది పూనమ్ కి అలవాటేనని.. ఇదొక ప్యూర్ పబ్లిసిటీ స్టంట్ అంటూ ఆమెను ఎద్దేవా చేస్తున్నారు.

Related Posts