యాక్షన్ బాట పట్టిన ‘సప్త సాగరాలు దాటి’ దర్శకుడు

కన్నడ సినిమా దశ దిశను మార్చిన యంగ్ డైరెక్టర్స్ లో హేమంత్ ఎం.రావ్ ఒకడు. డైరెక్టర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా, ప్రొడ్యూసర్ గా కన్నడ ఇండస్ట్రీలో హేమంత్ కి మంచి పేరుంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాధున్’కి స్క్రీన్ ప్లే రాసి.. జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. ఇక.. ఇదే దర్శకుడు తీసిన ‘కావలుదారి’ కన్నడలో మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్నే తెలుగులో సుమంత్ ‘కపటధారి’గా రీమేక్ గా చేశాడు.

రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ‘సప్త సాగరాలు దాటి’ సిరీస్ తో తెలుగులోనూ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు డైరెక్టర్ హేమంత్. ‘సప్త సాగరాలు దాటి’ తర్వాత ఈ డైరెక్టర్.. కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ హీరోగా కొత్త సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడట. పాన్ ఇండియా లెవెల్ లో జె.ఫిల్మ్స్ బ్యానర్ పై వైశాక్ జె గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా వచ్చింది.

Related Posts