‘శ్రీమంతుడు‘ కాంట్రవర్శీ గురించి మైత్రీ మూవీ మేకర్స్

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు‘ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఊరు దత్తత అనే కాన్సెప్ట్ తో రూపొందిన ‘శ్రీమంతుడు‘ 2015లో విడుదలైంది. ఈ సినిమా విడుదలై తొమ్మిదేళ్లవుతున్నా.. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి కథ విషయంలోని వివాదం ఓ కొలిక్కి రాలేదు.

‘శ్రీమంతుడు‘ సినిమా తాను రాసుకున్న ‘చచ్చేంత ప్రేమ‘ అనే నవలను కాపీ కొట్టి తీశారని.. నవల రచయిత శరత్‌ చంద్ర ఆరోపించారు. ఈ కథ వివాదం సుప్రీమ్ కోర్టు వరకూ వెళ్లింది. తాజాగా.. ఈ చిత్రం హీరో మహేష్ బాబు, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై కేసు వేసేందుకు నవల రచయిత శరత్ చంద్ర సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలో.. ‘శ్రీమంతుడు‘ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా దీని గురించి గురించి సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

‘శ్రీమంతుడు, చచ్చేంత ప్రేమ‘ రెండూ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయని.. ఆ రెండింటినీ గమనిస్తే వాస్తవాలు గమనించవచ్చని తమ ఓపెన్ స్టేంట్ మెంట్ లో తెలిపింది మైత్రీ మూవీ మేకర్స్. అలాగే.. ఈ వివాదం చట్ట పరిధిలో ఉన్నందున ఎవరూ వీటిపై ఓ అభిప్రాయానికి రావద్దని తమ లెటర్ లో కోరింది. ‘శ్రీమంతుడు‘ సినిమా ద్వారానే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం.

Related Posts