బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే గురువారం రాత్రి చనిపోయినట్లు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆమె టీమ్ ప్రకటించింది. ఆమె వయసు 32 ఏళ్లు. ‘ఈరోజు మాకు ఎంతో కఠినమైన రోజు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా మేము ఎంతో అభిమానించే పూనమ్ పాండే చనిపోయారని చెప్పడానికి ఎంతో బాధపడుతున్నాం. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి స్వచ్ఛమైన ప్రేమ, దయను పొందారు. ఈ బాధాకరమైన సమయంలో మేము గోప్యతను కోరుకుంటున్నాం’ అని పూనమ్ టీమ్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన పూనమ్.. కొన్ని కాంట్రవర్శీల్లోనూ నిలిచింది. అయితే.. శృంగార తారగానే పూనమ్ కి పేరొచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా అభిమానులతో టచ్ లో ఉండేది పూనమ్. తెలుగులో ‘మాలిని అండ్ కో‘ సినిమా లో పూనమ్ నటించింది.