మిస్టర్‌ బచ్చన్‌ వాలెంటైన్స్‌డే రొమాంటిక్ పోస్టర్

మాస్‌రాజా రవితేజ అప్‌మింగ్ మూవీ మిస్టర్‌ బచ్చన్‌. నామ్‌తో సునా హోగా ట్యాగ్‌లైన్‌. భాగ్యశ్రీ బోర్సే ఫిమేల్ లీడ్ చేస్తున్న ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్ డైరెక్ట్‌ చేస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
వాలెంటైన్స్ డే సందర్భంగా మిస్టర్ బచ్చన్ టీమ్‌ సూపర్బ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ రవితేజ, భాగ్యశ్రీ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నట్లు చూపించే రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇటివలే చిత్ర యూనిట్ కారంపూడిలో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Related Posts