మెలోడియస్ గా మెస్మరైజ్ చేస్తోన్న ‘నా సామిరంగ‘ పాట

కింగ్ నాగార్జున-కీరవాణి కాంబినేషన్ అంటేనే.. ఆ మ్యూజిక్ లో ఏదో మ్యాజిక్ ఉంటుందని అర్థమవుతోంది. గతంలో ఎన్నో సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ అందించిన ఈ కాంబో.. మళ్లీ ‘నా సామిరంగ‘ కోసం సెట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి కీరవాణి మార్క్ మెలోడీ రిలీజయ్యింది.

‘ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే.. ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరవుతుంటే..‘ అంటూ కీరవాణి అద్భుతమైన సాహిత్యంతో రాసిన ఈ పాటను మమన్ కుమార్, సత్య యామిని అందంగా ఆలపించారు. పచ్చని పల్లెటూరిలోని అందమైన లొకేషన్స్ లో.. ఓ బ్రిడ్జ్ పై లీడ్ పెయిర్ నాగార్జున, ఆషిక రంగనాథ్ లపై ఈ గీతాన్ని పిక్చరైజ్ చేసినట్టు తెలుస్తోంది.

Related Posts