మహేష్ కి జోడీగా ఇండోనేషియన్ బ్యూటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉన్నాడు దర్శకధీరుడు రాజమౌళి. SSMB29కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. స్టోరీ డెవలెప్ మెంట్ ఫినిషింగ్ స్టేజ్ కు రావడంతో.. లొకేషన్స్, మ్యూజిక్ సిట్టింగ్స్, కాస్టింగ్ సెలక్షన్ వంటివి ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు జక్కన్న. పాన్ వరల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న ఈ అడ్వంరస్ థ్రిల్లర్ లో మహేష్ బాబుకి జోడీగా ఓ ఇండోనేషియన్ బ్యూటీని ఫైనలైజ్ చేశాడట రాజమౌళి.

ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ ను SSMB29లో హీరోయిన్ గా ఎంపికచేశారనే ప్రచారం జరుగుతుంది. ఈమె అమెరికాలో పుట్టి పెరిగిన ఇండోనేషియన్ అమ్మాయి. పదేళ్ల నుంచి పలు సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించింది. రీసెంట్ గా ఈమె తన ఇన్ స్టాగ్రామ్ అక్కౌంట్ లో ఎస్.ఎస్.రాజమౌళిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో.. ఈ వార్తకు మరింత బలం చేకూర్చినట్టయ్యింది. అయితే.. చెల్సియా SSMB29లో ఫుల్ లెన్త్ హీరోయిన్ గా నటిస్తోందా? కీ రోల్ లోనే కనిపించనుందా? అనేది తెలియాల్సి ఉంది.

Related Posts