అలాంటి సీన్స్ క‌థ డిమాండ్ చేస్తేనే చేస్తాను. లేక‌పోతే చేయ‌ను – కృతిశెట్టి

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి.. మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న క‌థానాయిక కృతి శెట్టి. ఉప్పెన త‌ర్వాత వ‌రుస‌గా ఆఫ‌ర్స్ అందుకుంది కృతిశెట్టి. రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నాని స‌ర‌స‌న న‌టించింది. ఈ సినిమా ఈ నెల 24న విడుద‌లైంది. శ్యామ్ సింగ రాయ్ స‌క్స‌స్ సాధించ‌డంతో కృతి ఖాతాలో మ‌రో స‌క్స‌స్ చేరింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టింది.

ఇంత‌కీ ఏం చెప్పిందంటే.. ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని పాత్రలకు చాలా తేడా ఉంది. బేబమ్మ పాత్ర కోసం చాలా తెలుగు సినిమాలను చూశాను. ట్రెడిషన్, కల్చర్ గురించి తెలియాలి. విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదు. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఇంగ్లీష్ సినిమాలు, మోడ్రన్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని, నా స్టైల్లో నటించాను. నాకు వచ్చే పాత్రల పై నేనే రీసెర్చ్ చేసుకుంటాను. ఆ కారెక్టర్ ఎలా ఉంటుంది. ఆమె అలవాట్లు ఏంటి.? ఆమె ఎలాంటి పాటలు వింటుంది.? అని నేనే సపరేట్‌గా రాసుకుంటాను.

నాకు స్మోకింగ్ అంటే నచ్చదు. కానీ ఈ పాత్ర కోసం అదే చాలెంజింగ్‌గా అనిపించింది. ఆ సీన్స్ తీసేయోచ్చా? అని దర్శకుడిని కోరాను. అది కీర్తి, నువ్ కృతి. తేడా ఉండాలి కదా? అని దర్శకుడు అన్నారు. ఆరోగ్య సేతు సిగరేట్లను తీసుకొచ్చారు. దాంట్లో ఓన్లీ మిల్క్ టేస్ట్ ఉంటుంది. సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశాను. మొదటి రోజు ఫోటో షూట్ చేసేటప్పుడు నా చేతులు వణికిపోయాయి. నాని గారితో నటించడం అంటే మొదట్లో నాకు భయం వేసింది. కానీ ఆయన సెట్‌లొ ఎంతో ప్రోత్సహించేవారు.

బోల్డ్‌ సీన్స్‌ అనగానే అందరూ బ్యాడ్‌ అని అనుకుంటారు. మేము ఏం చేసినా వృత్తి పరంగానే చేస్తాం. యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఎలా కష్టపడతామో.. అన్ని సీన్లకు అలానే కష్టపడతాం. రొమాంటిక్‌ సన్నివేశాలు కథకు అవసరం ఉందనిపిస్తేనే చేస్తాను. లేదంటే నేను చేయను. శ్యామ్‌ సింగరాయ్‌లో వాటితో కథ ముడిపడి ఉంది. అందుకే చేశాను అని చెప్పింది.

Related Posts