మంచు కుటుంబం నుంచి మూడో తరం వారసుడు

తెలుగు చిత్ర పరిశ్రమలో వారసులకు ఏమాత్రం కొదవే లేదు. దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను ఏలుతున్న కథానాయకులు.. వారి వారసులను కూడా ఇదే రంగంలోకి తీసుకొస్తుంటారు. ఈకోవలోనే మంచు కుటుంబం నుంచి మోహన్ బాబు వారసుడిగా విష్ణు రాగా.. ఇప్పుడు విష్ణు వారసుడు అవ్రామ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అయ్యాడు. ఐదేళ్ల అవ్రామ్ ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నాడు.

విశేషమేమిటంటే.. కన్నప్పగా టైటిల్ రోల్ లో విష్ణు కనిపిస్తున్న ఈ మూవీలో మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు విష్ణు తనయుడు కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో.. మంచు కుటుంబం నుంచి మూడు తరాల వారసులు ‘కన్నప్ప’లో నటించినట్టవుతోంది. ప్రభాస్, మోహన్ లాల్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే న్యూజిలాండ్ లో కీలకమైన షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది.

Related Posts