సమంత-వరుణ్ ధావన్ వెబ్ సిరీస్ కి టైటిల్ ఫిక్స్

సమంత లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘సిటాడెల్’ సిద్ధమయ్యింది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ కానుంది. హాలీవుడ్ ‘సిటాడెల్’కి రీమేక్ గా రూపొందుతోన్న సమంత, వరుణ్ ధావన్ సిరీస్ కు ‘సిటాడెల్ – హనీ బన్నీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇప్పటికే సమంతతో ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కు వర్క్ చేసిన రాజ్ అండ్ డి.కె. ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది సమంత. ఈ సిరీస్ లోని సెకండ్ సీజన్ లో సమంత పోషించిన రాజీ పాత్రకు విపరీతమైన అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్2’లో సమంత చేసిన బోల్డ్ సీన్స్ ఒకింత చర్చకు కారణమవ్వగా.. ఈ సిరీస్ లోని ఆమె చేసిన యాక్షన్ ఘట్టాలు హాలీవుడ్ స్టాండార్డ్స్ లో ఉన్నాయనే ప్రశంసలు వచ్చాయి. మరి.. ఇదే టీమ్ తో వస్తోన్న ‘సిటాడెల్’ సమంతకు ఎలాంటి పేరు తీసుకొస్తుందో చూడాలి.

Related Posts