ఇంత షాక్ ఇచ్చావేంటి ప్రభాస్ ..

డార్లింగ్ స్టార్ ప్రభాస్ నుంచి ఊహించని అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ గురించి గత రెండు రోజుల క్రితమే హింట్ ఇచ్చారు. కానీ అప్పుడు అంతా.. ఏదైనా పాట లేద టీజర్ లేదంటే ఇంకేదైనా సినిమాకు సంబంధించి విడుదల చేస్తారేమో అనుకున్నారు. కానీ వీళ్లు ఏకంగా మూవీ రిలీజ్ డేట్ నే అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సలార్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ డేట్ తో దసరా సీజన్ షేక్ కాబోతోందని చెప్పేయొచ్చు.

బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియన్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ నుంచి ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలూ పెద్దగా ఆకట్టుకోలేదు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. బట్ ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న మూవీతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నారని అంతా అనుకున్నారు. అటు ప్రశాంత్ కూడా కెజీఎఫ్‌ తో కంట్రీ మొత్తం కలెక్షన్స్ కొల్లగొట్టాడు కాబట్టి.. ఈ కాంబినేషన్ లో కొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయం అనుకోవచ్చు. అయితే ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేస్తారు అనుకున్నారంతా. బట్ దసరా బరిలోనే నిలిపి ఆశ్చర్యపరిచింది టీమ్.

రెండు రోజుల్లో సలార్ మూవీకి సంబంధించిన అప్డేట్ వస్తుందని ముందే చెప్పింది టీమ్. బట్ అది రిలీజ్ డేట్ అని చాలామంది ఊహించలేదు. అందుకే ఇది అనెక్స్ పెక్టెడ్ అప్డేట్ అయింది. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలుసా.. సెప్టెంబర్ 28న. యస్ అక్టోబర్ 5న దసరా పండగ ఉంది. వారం ముందే సెలవులు మొదలవుతాయి కాబట్టి.. ఆ హాలిడేస్ తో సలార్ కలెక్షన్స్ వేట మొదలుపెడుతుందన్నమాట. ఇక దసరా టైమ్ కు వచ్చే సినిమాలకు కూడా ఈ మూవీ వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కాకపోతే సెప్టెంబర్ 28న రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన వారికి షాక్ తప్పదు. ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని మళ్లీ కెజీఎఫ్‌ కు లింక్ చేస్తారని కూడా వినిపిస్తోంది. ఏదేమైనా డార్లింగ్ నుంచి వచ్చిన ఈ క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ తెస్తోంది.

Related Posts