విరాటపర్వాన్ని ఎదురించేది ఎవరు..?

విరాటపర్వం.. టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ చర్చ నడుస్తోంది. ఎంత పెద్ద మొత్తంలో ఓటిటి ఆఫర్స్ వచ్చినా.. ఏ మాత్రం వెనకాడకుండా.. సురేష్ బాబు లాంటి నిర్మాత కూడా ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడంటేనే ఈ మూవీ ఏ రేంజ్ లో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ సినిమాక అయిన బడ్జెట్ 25 -30 కోట్లు. కేవలం ఓటిటి ఆఫర్స్ గానే 50 కోట్ల వరకూ వచ్చింది. మరోవైపు శాటిలైట్, థియేట్రికల్ అంటూ వేరే ఉన్నాయి. అయినా వీళ్లు ఓటిటికి వెళ్లలేదు. కారణం.. ఇది ఖచ్చితంగా వంద కోట్ల సినిమా అవుతుందనే నమ్మకంతోనే ఉండటమే.

రానా, సాయి పల్లవి, ప్రియమణి, నందితాదాస్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఫలానా వారు హీరో ఫలానా వారు హీరోయిన్ అనే టైప్ పాత్రల కంటే బలమైన ఎమోషన్స్ తో కదిలే క్యారెక్టర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో పాటు ఇప్పటి వరకూ తెలుగు తెరపై ఎవరూ చూపించని కోణంలో నక్సలిజాన్ని ఎలివేట్ చేస్తూనే.. ఆ ఇజంలో ఉండే మైనస్ లను సైతం ధైర్యంగా ఆవిష్కరించాడటం దర్శకుడు వేణ ఊడుగుల. అయితే ఇన్నాళ్లూ రిలీజ్ డేట్ విషయంలో కాస్త లేట్ చేసిన మూవీ టీమ్ ఫైనల్ గా అందరి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టింది. జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆ రోజు వచ్చే సినిమాలు విరాటపర్వంపై ఉన్న అంచనాలు తెలిసి సందిగ్ధంలో పడిపోయాయట.

జూలై1న విరాటపర్వం కంటే ముందే అనౌన్స్ అయిన సినిమా గోపీచంద్ హీరోగా మారుతి డైరెక్షన్ లో రూపొందిన పక్కా కమర్షియల్ సినిమా ఉంది. గోపీ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. ఇక అదే రోజు రెండు మూడు వాయిదాల తర్వాత అనౌన్స్ అయిన సినిమా రంగరంగ వైభవంగా. ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్, కేతికశర్మ జంటగా నటించిన సినిమా ఇది. మరి ఈ రెండు సినిమాలూ విరాటపర్వంకు పోటీ ఇవ్వడం అటుంచి అసలు దాని ముందు నిలుస్తాయా అనేదే పెద్ద ప్రశ్న అంటూ ఇండస్ట్రీలోనే మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఈ చిత్రం కోసం ప్రేక్షకులతో పాటు పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుండటం విశేషం అనే చెప్పాలి.

Related Posts