ఆ విషయంలో ఇండస్ట్రీ మెగాస్టార్ బాలయ్యే

నందమూరి బాలకృష్ణ.. తండ్రి వారసత్వంతో తెలుగు తెరకు వచ్చిన నటుడు. తండ్రిలాగే కళను గౌరవించే హీరో. ఇంకా చెబితే.. తనతరంలోనూ ఈ తరంలోనూ సినిమాను, కళను ఆ రేంజ్ లో గౌరవించే నటుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. తమ కుటుంబం ఇంత ఎదిగిన పరిశ్రమ అంటే బాలయ్యకు ముందు నుంచీ భక్తే ఉంది. అందుకే పరిశ్రమ బాగుకోసం ఏమైనా చేస్తాడు. ఏం చేయడానికైనా వెనకాడడు. అందుకే ఇన్నేళ్లైనా ఆయన రెమ్యూనరేషన్ లో మార్పులు పెద్దగా రాలేదు. కాదు.. రానీయలేదు. పరిశ్రమ మనుగడే నిర్మాతల పై ఆధారపడి ఉంది అనే ఆ కాలపు మాటను ఈ కాలంలోనూ అక్షరాలా పాటిస్తోన్న ఏకైక స్టార్ బాలకృష్ణ. మాస్ హీరోగా తనకూ తిరుగులేని క్రేజ్ ఉన్నా.. నేటికీ ప్రీమియర్స్ విషయంలో తనను కొట్టే హీరో లేకున్నా.. ఆయన రెమ్యూనరేషన్ విషయంలో ఎప్పుడూ ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీనే. ఇందుకు మరో అద్భుతమైన ఉదాహరణ.. ఇప్పుడు గోపీచంద్ మలినేనితో చేస్తోన్న సినిమా.

కొన్నాళ్లుగా బాలయ్య రెమ్యూనరేషన్ 8కోట్లే అంటే ఆశ్చర్యపోతారు. నిన్నగాక మొన్నొచ్చి ఒకటీ రెండు హిట్లు పడగానే పది కోట్లు డిమాండ్ చేస్తోన్న హీరోలున్న కాలంలో నాలుగు దశాబ్దాలకు పైగా పరిశ్రమలో అగ్ర హీరోగా ఉన్నా.. బాలయ్య మాత్రం నిర్మాతల క్షేమాన్ని మాత్రమే కోరుకుంటాడు. అందుకే తన రెమ్యూనరేషన్ పెంచడు. ఈ విషయంలో ఆయన సన్నిహితులు, మిత్రులు పెంచమని ఎన్నిసార్లు అడిగినా నో చెప్పాడట. ఇక రీసెంట్ గా వచ్చిన అఖండ వంద కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్ట మరోసారి బాలయ్య సింహగర్జనను బాక్సాఫీస్ కు చూపించింది. దీంతో ఆయన రెమ్యూనరేషన్ పెంచాల్సిందే అని బాగా దగ్గరవాళ్లు ఒత్తిడి తెచ్చారట. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గా మైత్రీ మూవీస్ లో చేస్తోన్న సినిమా నిర్మాతలను ఆ విషయమే అడిగాడు బాలయ్య.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మైత్రీ మూవీస్ లో వస్తోంది కదా..? ఈ మూవీ ఫైనల్ అయిన తర్వాత ‘‘ అందరూ రెమ్యూనరేషన్ పెంచమని అడుగుతున్నారు.. మీకు ఇబ్బంది లేకపోతే పెంచొచ్చా’’నిర్మాతలను అడిగాడు బాలయ్య. దీనికి వాళ్లు 20 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డా.. కేవలం ఒక కోటి మాత్రమే.. పెంచమని.. అంతకు మించి మీరు (నిర్మాతలు)ఇబ్బంది పడొద్దని చెప్పి నిర్మాతల బాగు కోర�