ఏంది “బేబీ” ఇంక అంతా డీ గ్లామర్ లేనా..?

దర్శకుల టేస్ట్ లను బట్టే కథలు వస్తుంటాయి. కొన్నాళ్ల క్రితం తెలుగు సినిమా పోకడలపై ఓ భారీ సెటైర్ వేస్తూ.. సంపూర్ణేష్ బాబును హీరోగా పరిచయం చేసి హృదయ కాలేయం అనే సినిమా చేశాడు సాయి రాజేశ్. అప్పట్లో ఇతను కూడా స్టీవెన్ శంకర్ అనే పేరు వేసుకున్నాడు. అప్పుడప్పుడే పెరుగుతోన్న సోషల్ మీడియా వల్ల ఈ మూవీ ఓవర్ నైట్ ఫేమ్ అయింది. అందుకు కారణం రాజమౌళి ట్వీట్. నిజానికి ఇదో షార్ట్ ఫిల్మ్ గా అనుకున్నారనీ.. రాజమౌళి ట్వీట్ తర్వాత వచ్చిన క్రేజ్ తో సినిమాగా మార్చారు అనీ చెప్పుకునేవాళ్లూ ఉన్నారు. ఆ తర్వాత చాలాకాలం పాటు లాగి లాగి కొబ్బరి మట్ట అనే సినిమా చేశాడు.

బట్ ఈ మధ్య కాలంలో కలర్ ఫోటో అనే సినిమాకు నిర్మాతగా వ్యవహారించాడు అంటారు. అంటారు అని ఎందుకంటున్నాం అంటే.. ఆ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు ఇతన్ని ఎవరూ పట్టించుకోలేదు. అంతా దర్శకుడే చూసుకున్నాడు మరి. చిరంజీవి అభిమానిగా నిత్యం మెగా ఫ్యామిలీతో అంటకాగుతూ అక్కడి నుంచి తెచ్చుకున్న పరిచయాలతో ఎస్కేఎన్ నిర్మాతగా ఇప్పుడు బేబీ అనే సినిమాను డైరెక్ట్ చేశాడు.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ బేబీ చిత్రంలో హీరో.

యూ ట్యూబ్ ద్వారా ఫేమ్ అయిన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. కానీ ఆ టీజర్ తో వీళ్లు ఏం చెప్పాలనుకున్నారు అనే అంశంలో ఏ క్లారిటీ లేదు. అదేమంటే.. టీజర్ ఆరంభంలోనే ” మొదటి ప్రేమకు మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది” అనే డైలాగ్ తో మొదలుపెట్టారు. బట్ టీజర్ అంతా స్కూల్ ఏజ్ పిల్లల మధ్య ప్రేమ అన్నట్టుగా కనిపిస్తోంది. అఫ్‌ కోర్స్ ఎవరి తొలిప్రేమ అయినా స్కూల్ టైమ్ లోనే ఉంటుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ ను పూర్తిగా డీ గ్లామర్ గా చూపించారు.

తను చివర్లో అమ్మాయి ఏదో జరగబోతోందన్న విషయం ఇక్కడ(గుండెలపై చేయి వేసుకుని) తెలుస్తుంది అన్న మాట బావుంది. బట్ టీజర్ ఆసాంతం ఇప్పటికే వచ్చిన ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ ను చూసినట్టుగా కనిపిస్తోంది తప్ప.. ఏ మాత్రం ఇంపాక్ట్ కనిపించలేదు. అంటే ఒక టీజర్, ట్రైలర్ చూసినప్పుడు ఆ సినిమా చూడాలి అన్న భావన ఆడియన్స్ లో కలగాలి. బట్ ఈ బేబీని చూస్తే అలాంటివేం కలిగినట్టు అనిపించలేదు. చాలా సాధారణంగా.. పరమ రొటీన్ గా కనిపిస్తోన్న ఈ బేబీ మేకప్ చూస్తే ఈ దర్శకుడు గతంలో కలర్ ఫోటోలో చెప్పిన అంశాన్ని ఈ సారి హీరోయిన్ యాంగిల్ లో చెప్పబోతున్నాడా అనిపించక మానదు. బట్ ప్రతిసారీ డీ గ్లామర్ అంటే వర్కవుట్ కాదు బేబీ.

Related Posts