ఎలాంటి బ్యాన‌ర్ లో ఎలాంటి సినిమా వ‌చ్చింది..

తెలుగు సినిమా చరిత్ర‌లో పూర్ణోద‌యా బ్యాన‌ర్ అంటే ఓ గ్రేట్ నెస్ ఉంది. ఆ బ్యాన‌ర్ లో వ‌చ్చిన సినిమాలు చూస్తే తెలియ‌కుండానే వారిపై రెస్పెక్ట్ పెరుగుతుంది. నాటి నుంచి నేటి వ‌ర‌కూ ది బెస్ట్ బ్యాన‌ర్స్ లిస్ట్ తీస్తే టాప్ 5లో ఉంటుంది పూర్ణోద‌యా. ఏడిద నాగేశ్వ‌ర‌రావు గారు నిర్మించిన సినిమాలు, సాధించిన విజ‌యాలు.. తెలుగు వారి హృద‌యాల్లో వాటి ఇంపాక్ట్.. ఇలా ఎలా చూసినా.. అదో మ‌ర‌పురాని సంస్థ‌. అలాంటి సంస్థ నుంచి మూడో త‌రం వార‌సురాలు శ్రీజ నిర్మించిన సినిమా చూస్తే వారి టేస్ట్ పై జాలి క‌ల‌గ‌క మాన‌దు.అస‌లు ఒక్కో బ్యాన‌ర్ లో ఒక‌టో రెండో క్లాసిక్స్ ఉండ‌టమే రేర్. అలాంటిది ఈ బ్యాన‌ర్ లో వ‌చ్చిన సినిమాల‌న్నీ క్లాసిక్స్ గానే నిల‌వ‌డం ఓ రికార్డ్.

సిరిసిరి మువ్వ‌, తాయార‌మ్మ బంగార‌మ్మ‌, శంకరాభ‌ర‌ణం, సీతాకోక చిలుక‌, సాగ‌ర సంగ‌మం, సితార‌, స్వయంకృషి, స్వ‌ర్ణ‌క‌మ‌లం, ఆప‌ద్బాంధ‌వుడు.. ఇలా ఏ సినిమాను త‌క్కువ‌గా చూస్తాం.. ఏ సినిమాను ఇది క్లాసిక్ కాదు అని చెబుతాం., అంత గొప్ప బ్యాన‌ర్ లో ఇప్పుడు ఏ మాత్రం క‌థా బ‌లం లేని.. సినిమాపై గౌర‌వం కూడా క‌నిపించిన సినిమా వ‌చ్చిందంటే ఆశ్చ‌ర్యం కంటే బాధే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.అఫ్ కోర్స్ మారుతున్న త‌రాల‌ను బ‌ట్టి క‌థ‌లు మారొచ్చు. కానీ మ‌రీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో సినిమా చూస్తే త‌రాల మేట‌ర్ అలా ఉంచితే..

అస‌లు ఇలాంటి క‌థ‌ను ఎంచుకునేందుకు నాగేశ్వ‌ర‌రావు గార‌బ్బాయి శ్రీరామ్ కైనా కాస్త ఉండాలి క‌దా అనిపిస్తే కూడా త‌ప్పేం లేదు. ఎందుకంటే ఆ బ్యాన‌ర్ లో వ‌చ్చిన సినిమాల‌ను తెలుగు వారి సంస్కృతికి ప్రతీక‌గా చూసే ఆడియ‌న్స్ కూడా ఉన్నారు. ఉంటారు కూడా. ఏడిద శ్రీరామ్ కూతురు శ్రీజ నిర్మించిన ఈ చిత్రానికి జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ క‌థ‌(..??) అందించాడ‌నే హైప్ తేవ‌డం ఏంటీ.. ప్ర‌మోష‌న‌న్స్ లో వారి ఓవ‌రాక్ష‌న్ చూడ్డం ఏంటీ.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు మెగాస్టార్ రావ‌డం వ‌ర‌కూ ఓ రేంజ్ లో హ‌డావిడీ చేశారు. క‌థ‌లో ద‌మ్ముండి, సినిమాలో మేట‌ర్ ఉన్న‌ప్పుడు ఇలాంటివి ప‌రిగ‌ణ‌లోకి రావు. కానీ ఈ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో మూవీ చూసిన త‌ర్వాత పూర్ణోద‌యా బ్యాన‌ర్ పై పాత గౌర‌వం స్థానంలో జాలి క‌లుగుతుంది. మ‌రి రాబోయే రోజుల్లో అయినా బ‌ల‌మైన క‌థ‌లు చెప్పాల‌ని ఆశిద్దాం.

Related Posts