కృష్ణ‌మ్మ పాట‌.. రివ్యూ

పాట‌లే సినిమాల‌క బ‌లం. ఒక్కోసారి సినిమాలు పోయినా ఆ పాట‌లు వెంటాడ‌తాయి. ఇప్పుడు త‌గ్గింది కానీ.. ఒక‌ప్పుడు సినిమాల‌కు ఓపెనింగ్స్ తెచ్చింది పాట‌లే. కొన్నాళ్లుగా సినిమా పాట‌ల్లో వాయిద్యాల మోత పెరిగింది. సాహిత్యం విలువ త‌గ్గింది. ఎప్పుడో కానీ ఈ రెండూ బావున్న పాట‌లు క‌నిపించ‌వు. ముఖ్యంగా ఇలాంటివి చిన్న సినిమాల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌నేది నిజం.స‌త్య‌దేవ్ హీరోగా న‌టించిన కృష్ణ‌మ్మ సినిమా నుంచి విడుద‌లైన ఓ పాట ఇలాగే వింటున్న కొద్దీ మ‌న‌సుకు హాయి అయిన ఫీలింగ్ ని ఇస్తుంది. అలాగ‌ని ఇదేదో ప్రేమ‌గీతం అనుకుంటే కాదు. కొంద‌రు స్నేహితుల మ‌ధ్య సాగే గీతం. కాల‌భైర‌వ సంగీతం అందించిన ఈ పాట వింటే రెండు ద‌శాబ్ధాల క్రితం నాటి కీర‌వాణి గుర్తొస్తే ఆశ్చ‌ర్యం లేదు.

అంత అందంగా కంపోజ్ చేశాడు. ఒక్కో ఇన్ స్ట్రుమెంట్ సాహిత్యానికి క‌ట్టుబ‌డి వినిపించింది., అటు అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంటే.. దాన్ని చెవుల‌కు ఇంపుగా తాకేలా అత్యంత స్ప‌ష్టంగా ఆల‌పించి మ‌రోసారి త‌న‌దైన ముద్ర‌ను బ‌లంగా వేశాడు సింగ‌ర్ అనురాగ్ కుల‌క‌ర్ణి. కృష్ణ‌మ్మ కృష్ణ‌మ్మ నీలాగే పొంగింద‌మ్మా మాలో సంతోషం.. ఈ కొమ్మా ఆ రెమ్మా చ‌ల్లాయే గంధాలేవో మాపై ఈ నిమిషం అంటూ సాగే ఈ మాంటేజ్ సాంగ్ సినిమాకు ఓ పెద్ద హెల్ప్ అయ్యేలా క‌నిపిస్తోంది. అన్న‌ట్టు ఈ పాట‌కంటే ముందు విడుద‌లైన ప్రేమ‌గీతం సైతం ఈ చిత్రం నుంచి బాగా ఆక‌ట్టుకుంటోంది.

Related Posts