మ‌ళ్లా… పుష్ప లెక్క‌నే ర‌ష్మిక మంద‌న్నా..

హీరోయిన్లు అంటే అందంగా ఉండాల్సిందే అనేది అన‌ఫీషియ‌ల్ రూల్. కొన్నిసార్లు ఆ రూల్స్ బ్రేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్స్ కొట్టిన‌వాళ్లు అప్పుడూ ఉన్నారు.. ఇప్పుడూ ఉన్నారు. ఆ లిస్ట్ లో రీసెంట్ టైమ్స్ లో అంద‌రికీ క‌నెక్ట్ అయిన సినిమా పుష్ప‌. ఈ చిత్రంలో నేష‌న‌ల్ క్ర‌ష్ అనిపించుకున్న ర‌ష్మిక మంద‌న్నా డీ గ్లామ‌ర్ లుక్ కూడా అద్భుతంగా కుదిరింది. అంద‌రికీ నచ్చింది. డీ గ్లామ‌ర్ రోల్ లోనూ గ్ల‌మ‌ర‌స్ గా క‌నిపించ‌డం ర‌ష్మిక‌కే చెల్లింది. ఓ ర‌కంగా సీనిమాలో త‌న పాత్ర ఓ హైలెట్ కావ‌డంలో ఆమె లుక్ కూడా ఓ కార‌ణం. నిజానికి హీరోయిన్లు ఇలాంటి పాత్ర‌లు చేయడానికి అంత ఈజీగా ముందుకు రారు. బ‌ట్ ర‌ష్మిక డేర్ చేసింది. త‌న డేరింగ్ డెసిష‌న్ కంట్రీ మొత్తాన్ని ఫిదా చేసింది. మ‌రి ఇదే బావుంది అనుకుందో లేక పాత్ర ప‌రంగా ఓకే చేసిందో కానీ మ‌రోసారి డీ గ్లామ‌ర్ రోల్ తో రాబోతోందీ శ్రీవ‌ల్లి.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో పాగా వేసే ప్ర‌య‌త్నాలు బలంగా చేస్తోంది ర‌ష్మిక. ఈ మేర‌కు మూవ్ చేసిన స్టెప్స్ అన్నీ అదిరిపోయాయి. త‌న చేతిలో ఇప్పుడు మూడు హిందీ చిత్రాలున్నాయి. అందులో మొద‌టిది గూడ్ బై. ఇండియ‌న్ లెజెండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని ద‌స‌రా బ‌రిలో విడుద‌ల చేయ‌బోతున్నామ‌ని అనౌన్స్ చేసింది టీమ్. అంటే షూటింగ్ ఎప్పుడో ఫినిష్ అయింద‌న్న‌మాటే క‌దా..? వికాస్ బెహెల్ డైరెక్ట్ చేసిన గూడ్ బై చిత్రాన్ని అక్టోబ‌ర్ 7న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇక ఈ లుక్ లో అమితాబ్ వెన‌క డీ గ్లామ‌ర్ లుక్ తో నించుని ఉన్న రష్మికను చూసి చాలామంది.. మ‌రోసారి పుష్ప‌లాగా సూప‌ర్ స‌క్స‌స్ అవుతుందా అని అనుకుంటున్నారు. ఏదేమైనా ర‌ష్మిక స్టెప్స్ బ‌లే ఉన్నాయి.