ఈ పంచాయితీ ఏంది జయమ్మా..?

యాంకర్ గా టాప్ అనిపించుకుని అప్పుడప్పుడూ వెండితెరపై మెరుస్తోన్న టాలెంటెడ్ లేడీ సుమ. మాటల విషయంలో సుమను దాటే మరో తెలుగు యాంకర్ ఇప్పటి వరకూ లేదు రాదు అని కూడా చెప్పొచ్చు. ఒక్కోసారి వేదికలపై ఇరిటేట్ చేసినా.. ఓవరాల్ గా ఆయా వేదికలను ఎంటర్టైన్ చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా అనేది నిజం. ఇక కెరీర్ ఆరంభంలో హీరోయిన్ గా ఒకే ఒక్క సినిమా చేసిన సుమ ఇన్నేళ్ల తర్వాత తనే ప్రధాన పాత్రగా నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. ఓ కొత్తదర్శకుడు రూపొందించిన సినిమా ఇది. ఈ నెల 6న విడుదల కాబోతోంది. మొన్నటి వరకూ ఈ చిత్రంపై కాస్త ఆసక్తి కనిపించింది. పైగా ప్రమోషన్స్ కోసం టాప్ హీరోలు, దర్శకుల సాయం తీసుకుంటోంది. తను అడగ్గానే అంతా ఏదోకటి చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశాడు.


ఆ మధ్య వచ్చిన టీజర్ తో పోలిస్తే ఈ ట్రైలర్ కాస్త తేలిపోయిందనే చెప్పాలి. ఒకే విలేజ్ కు సంబంధించిన కథలా కనిపిస్తోంది. ఆ గ్రామీణ ప్రాంతంలో ఎమోషన్స్ వర్కవుట్ అయితే ఓకే. కానీ కేవలం ఎమోషన్స్ కే బాక్సాఫీస్ పడిపోయే పరిస్థితి లేదిప్పుడు. కథలోనూ చిక్కదనం కాస్త తక్కువగానే కనిపిస్తోంది.ఓ చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న పంచాయితీలా కనిపిస్తోందీ ట్రైలర్ చూస్తోంటే. అదీ కాక ఇప్పటి వరకూ టీనేజ్ లవ్ స్టోరీస్ చూసిన మనకు అంతకంటే తక్కువ వయసు పిల్లలు ఆకర్షితులైన కోణం కూడా ఈ చిత్రంలో కనిపించబోతోంది. సుమ లాంటి లేడీ ఇలాంటి పాత్రలను ఉన్నప్పుడు ఒప్పుకోవడం కాస్త ఆశ్చర్యమే.
తన భర్తకు ఆపరేషన్ కోసం డబ్బులు సమకూర్చుకునే జయమ్మ అనే మహిళకు ఆ డబ్బులు ఊరి పంచాయితీకి ముడిపడి ఉండటం అనే పాయింట్ కనిపిస్తోంది. ఈ పాయింట్ తో పాటు ఊర్లోని వివిధ వర్గాల ప్రజల ఎమోషన్స్, ఎలివేషన్స్ కూడా ఉండేలా ఉన్నాయి. ఏదేమైనా ట్రైలర్ చూశాక టీజర్ చాలా బెటర్ అనిపించింది. మరి కావాలని ఏదైనా బలమైన కంటెంట్ దాచారా లేక సినిమా కూడా ఇంతే ఉంటుందా అనేది చూస్తే కానీ తెలియదు. బట్ ఈ ట్రైలర్ మాత్రం సో సో గానే ఉందని చెప్పాలి.

Related Posts