విజయ్ దేవరకొండ.. మార్పు మంచిదే..

ఇమేజ్ లు మార్చుకుంటూ వెళితేనే ఇండస్ట్రీలో మనుగడ ఉంటుంది. పర్టిక్యులర్ ఇమేజ్ వచ్చిన తర్వాత దాన్ని మాత్రమే కంటిన్యూ చేసేలా కథలు ఎంచుకుంటే చాలా త్వరగా ఇబ్బందులు మొదలవుతాయి. అర్జున్ రెడ్డితో వచ్చిన ఇమేజ్ ను చూసి విజయ్ దేవరకొండ కూడా తర్వాత ఆ పాత్ర తరహాలో ఉండేవే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్లాడు. అలా కాకుండా ఉన్న గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయింది. అలాగే ఉన్న సినిమాలన్నీ పోయాయి. ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్నా.. ఇప్పుడు మళ్లీ రూట్ మార్చి పోలీస్ గా రాబోతున్నాడు.


విజయ్ దేవరకొండ.. చాలా త్వరగా స్టార్డమ్ తెచ్చుకున్న హీరో. గీత గోవిందంతో తనకంటే ముందు వచ్చిన హీరోలను దాటి వంద కోట్ల క్లబ్ లో కూడా చేరాడు. దీంతో విజయ్ టాప్ స్టార్ రేస్ లోకి వెళతాడు అనుకున్నారు చాలామంది. కానీ రాంగ్ స్టోరీస్ పిక్ చేసుకుని లాస్ అయిపోయాడు. పైగా అతన్లో అర్జున్ రెడ్డి మూవీలోని క్యారెక్టర్ కూడా ప్రవేశించడంతో వేదికలపై ఆ యాటిట్యూడ్ కనిపించి మైనస్ గా మారింది. అయినా అతను మారలేదు. బట్ లైగర్ తర్వాత చాలా పెద్ద షాక్ తిన్నాడు. ఈ మూవీ విషయంలో అతను ఎన్ని అంచనలు పెట్టుకున్నాడో అవన్నీ మొదటి ఆటకే ముగిసిపోయాయి. ఈ మూవీ కెరీర్ తో పాటు క్యారెక్టర్ పైనా ఎఫెక్ట్ చూపించిందంటే అతిశయోక్తి కాదు. లైగర్ తర్వాత రావాల్సిన ఖుషీ సినిమాపై హోప్స్ ఉన్నాయి. సమంత ఆరోగ్యం బాలేక ఇంకా 20శాతం షూటింగ్ బ్యాలన్స్ ఉంది. మరి ఈ గ్యాప్ లో నెక్ట్స్ సినిమా ఏంటీ అనే ప్రశ్నకు చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చేసింది.


విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ సంక్రాంతి సందర్బంగా వాటిని కన్ఫార్మ్ చేసింది మూవీ టీమ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీ రాబోతోంది. లేటెస్ట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ ను చూస్తే విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.’నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి.. నేను ఎక్కడివాడినో నాకూ తెలియదు” అనే క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది. గతంలో మళ్లీరావా, జెర్సీ సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గౌతమ్ ఈ సారి యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. ఇటు విజయ్ కీ ఈ తరహా కథ ఫస్ట్ టైమ్. సో ఈ కాంబినేషన్ ఆసక్తిని పెంచేదే. త్వరలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతోన్న ఈ మూవీని ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గానే చెబుతున్నారు. హీరోయిన్ తో పాటు ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తారట. మొత్తంగా ఈ మార్పు విజయ్ కెరీర్ కు ప్లస్ అవుతుందనే చెప్పొచ్చు.

Related Posts