రామబాణంలా వస్తున్న గోపీచంద్

కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు బలమైన కథలు ఎంచుకోవాలి. లేదంటే ఉన్న ఇమేజ్ పోతుంది. ఈ మాట గోపీచంద్ కు కరెక్ట్ గా సరిపోతుంది. ఒకప్పుడు మేచో మేన్ గా యాంగ్రీమేన్ ఇమేజ్ తో దూసుకుపోయిన అతను మధ్యలో కామెడీ సినిమాలు చేసి లాస్ అయ్యాడు. మళ్లీ తన ఇమేజ్ కు తగ్గ కథలు సెలెక్ట్ చేసుకుంటున్నా.. ఎందుకో బౌన్స్ బ్యాక్ కాలేకపోతున్నాడు. బట్ ఈ సారి గ్యారెంటీ హిట్ అనేలా రామబాణంలా దూసుకువస్తున్నాడు. మరి ఈ రామబాణం అతని లక్ష్యాన్ని నెరవేరుస్తుందా..?


మేచో మేన్ గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నాడు గోపీచంద్. మాస్ అనే మాటకు కరెక్ట్ కటౌట్ లా కనిపించే గోపీచంద్ మధ్యలో అప్పుడున్న ట్రెండ్ లో పడి కామెడీ సినిమాలు చేశాడు. ఒకటీ రెండు హిట్ అయినా.. మిగతావి ఫట్ అయ్యాయి. దీంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు. ఆ మధ్య సీటీమార్ తో కమర్షియల్ గా హిట్ అందుకున్నాడు. బట్ తర్వాత పక్కా కమర్షియల్ తో మరో ఎక్స్ పర్మెంట్ చేసి డిజాస్టర్ చూశాడు. కొన్నాళ్ల క్రితమే గోపీచంద్ కెరీర్ పై చాలా కమెంట్స్ వచ్చాయి. మళ్లీ విలన్ గా చేసుకోవడం బెటర్ అన్నవాళ్లూ ఉన్నారు. హిట్స్ లేనప్పుడు ఇలాంటి డైలాగ్స్ కామన్ కాబట్టి.. అతను అవేవీ పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూనే వున్నాడు. కొన్నాళ్ల క్రితం తనకు లక్ష్యం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ తో సినిమా చేస్తున్నాడిప్పుడు. లక్ష్యం శ్రీవాస్ ఫస్ట్ మూవీ. అతనే గోపీచంద్ కు లౌక్యం వంటి ఎంటర్టైనింగ్ హిట్ ఇచ్చాడు. రెండు హిట్స్ ఇచ్చిన కాబినేషన్ రిపీట్ అయితే అంచనాలుంటాయి కదా.?


గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రానికి “రామబాణం” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రీసెంట్ గా రవితేజ ఖిలాడీ మూవీలో కనిపించిన డింపుల్ హయాతీ హీరోయిన్ గా నటిస్తోంది. విశేషం ఏంటంటే.. లక్ష్యం చిత్రంలో గోపీచంద్ బ్రదర్ గా ఓ పవర్ ఫుల్ రోల్ చేసిన జగపతిబాబును మరోసారి అదే పాత్రలో తీసుకున్నారు. జగపతిబాబుకు జోడీగా ఖుష్బూ నటిస్తోంది. భారీ బడ్జెత్ తో వస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మరో కొత్త అప్డేట్ ఏంటంటే..ఈ రామబాణం ను వేసవిలోనే విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ కాగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారట. మరి ఈ రామబాణం గోపీచంద్ బ్లాక్ బస్టర్ లక్ష్యాన్ని ఛేదిస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts