రివాల్వర్ రీటాగా కీర్తి సురేష్‌

వైవిధ్యమైన కథలు సెలెక్ట్ చేసుకుంటూ అయితే హీరోయిన్ లేదంటే తనే మెయిన్ రోల్ లో నటిస్తూ దూసుకుపోతోంది కీర్తి సురేష్. లాస్ట్ ఇయర్ సర్కారువారి పాటతో తనలోని గ్లామర్ యాంగిల్ కూడా చూపించిన ఈ బ్యూటీ ఇప్పుడు రివాల్వర్ రీటాగా వస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ను సమంత చేతుల మీదుగా విడుదల చేయడం విశేషం.

కీర్తి సురేష్‌ ఇంతకు ముందు చేసిన ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ తో పోలిస్తే ఈ లుక్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. రెండు తుపాకులు పట్టుకుని స్టైలిష్‌ గా కనిపిస్తోన్న ఈ ఫోటో చూస్తే తను మరో కొత్త కథ ఎంచుకున్నట్టు అర్థం అవుతోంది. ఇక టైటిల్ చూస్తే కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన రివాల్వర్ రాణి గుర్తుకు రావడం ఖాయం. అందులో తన పాత్ర రగ్గ్ డ్ గా ఉంటుంది. మరి కీర్తి సురేష్ ఈ మూవీలో ఎలా కనిపిస్తుందో కానీ.. ఈ లుక్ మాత్రం ఎప్పట్లానే ఆకట్టుకుంటోంది.


అయితే కీర్తి సురేష్ తనే మెయిన్ లీడ్ గా నటించిన సినిమాల్లో ఎక్కువగా ఓటిటిల్లోనే వచ్చాయి. అవేవీ పెద్దగా ఆకట్టుకున్న దాఖలాలు కూడా లేవు. అయినా ఈ దండయాత్ర ఆపకుండా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ తో దూసుకుపోతోందీ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో నాని సరసన దసరా అనే సినిమాలో నటించింది. మార్చి చివర్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.

నిన్నటి వరకూ టైటిల్ లేకుండా ఉన్న ఈ తమిళ్ మూవీని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేసే అవకాశాలున్నాయి. కె చంద్రు అనే దర్శకుడు రూపొందించిన మూవీ ఈ రివాల్వర్ రాణి. ఇతను 2010లో తమిళ్ లో రూపొందించిన తమిళ్ పాదమ్ అనే సెటైరికల్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమానే తెలుగులో అల్లరి నరేష్ సుడిగాడుగా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. మరి అలాంటి దర్శకుడు రూపొందించిన ఈ మూవీ కీర్తి సురేష్‌ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Related Posts