వర్మ ‘వ్యూహం’ మరోసారి వాయిదా.. ఈసారి కారణం వేరే

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రాజకీయ చిత్రాలు ‘వ్యూహం, శపథం’ వారం రోజుల గ్యాపులో విడుదల కావాల్సి ఉన్నాయి. ఫిబ్రవరి 23న ‘వ్యూహం’ చిత్రాన్ని.. మార్చి 1న ‘శపథం’ సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. అయితే.. మరోసారి ఈ రెండు చిత్రాలు వాయిదా పడ్డాయి.

‘వ్యూహం’ సినిమాని మార్చి 1 కి, ‘శపథం’ చిత్రాన్ని మార్చి 8కి వాయిదా వేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కానీ.. ఈసారి కారణం లోకేష్ కాదని.. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మార్చి 1 మరియు మార్చి 8న తమ చిత్రాలను విడుదల చేస్తే రిలీజ్ పరంగా తాము కోరుకుంటున్న థియేటర్లు దొరుకుతున్న మూలంగానే ఈ చిత్రాలను వాయిదా వేస్తున్నట్టు వర్మ తన ట్వీట్ లో తెలిపాడు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను నేపథ్యంగా తీసుకుని వర్మ ‘వ్యూహం, శపథం’ సినిమాలను తెరకెక్కించాడు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాలను నిర్మించారు. ఈ మూవీస్ లో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా.. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. సెన్సార్ అడ్డంకులు దాటుకుని ఈ సినిమాలు విడుదలకు ముస్తాబయ్యాయి.

Related Posts