వెన్నెల కిశోర్‌ స్పై కామెడీ ‘చారి 111’

మళ్లీ మొదలైంది సినిమా తర్వాత టీజి కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన మూవీ చారి 111. వెన్నెల కిశోర్‌, సంయుక్తా విశ్వనాథన్‌ జంటగా రాబోతున్న ఈ మూవీని బర్కత్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై అదితిసోని నిర్మిస్తున్నారు. మార్చి 1న ఈ చిత్రాన్ని రిలీజ్‌ డేట్ ప్రకటించారు.
నవ్వించే గూఢాచారిగా చారి పాత్రలో వెన్నెల కిశోర్ అద్భుతంగా నటించాడు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, కాన్సెప్ట్ టీజర్‌ ఆకట్టుకుంటున్నాయి.


”ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది సినిమా. వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ స్పై రోల్స్ చేశారు. వాళ్లకు బాస్ రోల్ మురళీ శర్మ చేశారు. కథలో ఆయనది కీలక పాత్ర” అని చెప్పారు దర్శకుడు టీజీ కీర్తికుమార్‌.
”స్పై జానర్ సినిమాల్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. ‘వెన్నెల’ కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయన్నారు నిర్మాత అదితిసోని.

Related Posts