ర్యాంబో..టెర్మినేటర్ లాంటి యాక్షన్‌ అడ్వంచర్‌ ‘ఈగల్’ : కార్తీక్‌ ఘట్టమనేని

రవితేజ మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ ఈగల్‌. అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ ఫీమేల్ లీడ్ చేస్తున్న ఈ మూవీలో నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ ఇతర కీరోల్స్ పోషిస్తున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని డైరెక్షన్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 9 న రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.


సమాజం కోసమే ఈగల్ విధ్వంసం అంటున్నారు దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని. ర్యాంబో, టెర్మినేటర్‌ లాంటి ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ స్టాండర్డ్స్‌ తో సినిమా తీయాలని ఉండేది. ఈగల్‌ అలాంటి ప్రయత్నమే అన్నారు.
రవితేజ బ్రిలియెంట్ యాక్టర్‌ . కమర్షియల్ సినిమాల్లో అన్నిరకాలు గా చేసేవారు. కానీ ఈగల్‌ లో మాత్రం ఒక క్యారెక్టర్‌లాగే కనిపిస్తారు అంటున్నారు డైరెక్టర్. ఇంటెన్స్ గా ఉంటూ కూల్ గా వుండటం ఆయనలో డిఫరెంట్ క్యాలిటీ.


విరుమాండి, రషోమన్, విక్రమ్ తరహా శైలి ప్రయత్నించాం. కాన్సెప్ట్ అంతా ముందే చెప్పేస్తే ఆ ఎక్సయిట్మెంట్ పోతుంది. సినిమా చూశాకా మీరు ట్రైలర్ చూస్తే.. కాన్సెప్ట్ క్లియర్ గా ట్రైలర్ లోనే చెప్పామని అర్ధమైపోతుంది.


రవితేజ గారి ఎనర్జీ లెవెల్స్ ఒక ఎత్తు.. అయితే ముఖ్యంగా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ అన్నారు.
ఈగల్ నాలుగు కిలోమీటర్ల ఎత్తులో వున్నా కిందవున్న రాబిట్ ని చూడగలదు. ఇందులో హీరోకి ఆ ఐ పవర్ వుంది. అలాగే ఈ పాత్రకు సినిమాలో కోడ్ నేమ్ కూడా ఈగల్. హిందీలో కూడా ఈ పేరు పెట్టడానికి ప్రయత్నించాం. ఇదే పేరుతో అక్కడ ఓ సినిమా వుంది. దీంతో ఈ కథలో హీరో పేరు ‘సహదేవ్ వర్మ’ టైటిల్ తో హిందీలో విడుదల చేస్తున్నామన్నారు.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోం బ్యానర్ లా అయిపోయింది. సినిమాకి కావాల్సిన ప్రతిది ఒక్క ఫోన్ కాల్ తో సమకూర్చుతారు. నిర్మాత విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి కృతజ్ఞతలన్నారు
దర్శకుడిగా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ ..తేజ సజ్జాతో ఓ సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా గురించి తెలియజేస్తాన్నారు.

Related Posts