వరుణ్ ధావన్ సౌత్ రీమేక్ కు టైటిల్ ఫిక్స్

బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు సౌత్ కంటెంట్ ను నమ్ముకుంటున్నారు. తమను మళ్ళీ అగ్రపథంలోకి తీసుకెళ్లేందుకు సౌత్ మూవీస్, సౌత్ టెక్నీషియన్స్ అవసరమని భావిస్తున్నారు. ఈకోవలోనే.. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్.. తమిళ చిత్రం ‘తేరి’ రీమేక్ లో నటిస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన ‘తేరి’ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని అట్లీ సమర్పణలో జియో స్టూడియోస్ తో కలిసి అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మిస్తుంది. లేటెస్ట్ గా ఈ రీమేక్ మూవీకి ‘బేబీ జాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. స్పెషల్ టీజర్ రిలీజ్ చేశారు.

‘బేబీ జాన్’ మూవీకి మరో స్పెషల్ అట్రాక్షన్ హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సినిమాతో బీటౌన్ లోకి ఎంట్రీ ఇస్తుంది కీర్తి. అలాగే.. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తుండడం మరో విశేషం. ఈ మూవీలో వామిక గబ్బి మరో కథానాయిక. మొత్తంగా.. టైటిల్ టీజర్ తో మంచి అంచనాలే ఏర్పరచిన ‘తేరి’ రీమేక్.. బాలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related Posts