బన్నీ కోసం రూటు మార్చిన త్రివిక్రమ్

ఇప్పటివరకూ గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది అన్న త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకోసం నిజంగానే ఎక్కువ గ్యాప్ తీసుకోబోతున్నాడట. ఈమధ్య ఓ అత్తకోసమో.. అమ్మ కోసమో వెతుక్కుని వెళ్లే హీరో కథలను ఆవిష్కరిస్తున్న మాటల మాంత్రికుడు ఈసారి మాత్రం ఓ పాన్ ఇండియా కాన్సెప్ట్ ను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడట. అల్లు అర్జున్ కోసం లార్జర్ దెన్ లైఫ్ స్టోరీని సిద్ధం చేస్తున్నాడట.

ఇప్పటికే అల్లు అర్జున్ కి ‘జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో’ వంటి హ్యాట్రిక్ హిట్స్ అందించాడు త్రివిక్రమ్. ఈసారి డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుడుతూ నాల్గవసారి కలిసి పనిచేయబోతున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకే ఏడాదికి పైగా సమయం పట్టనుందట. ఈలోపులో అల్లు అర్జున్ మరో ఒకటి, రెండు సినిమాలను పూర్తిచేస్తాడనే ప్రచారం ఉంది. త్రివిక్రమ్ కూడా వెంకటేష్, నాని కాంబోలో మల్టీస్టారర్ చేసే అవకాశం ఉంది.

Related Posts