మాళవిక నాయర్‌ తో ‘మనమే’ అంటున్న శర్వానంద్….

శర్వానంద్ లేటెస్ట్ ప్రాజెక్ట్‌ ‘మనమే’ వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. నాగ్‌ నాని ల దేవదాస్, శమంతకమణి చిత్రాలతో స్పెషల్ స్టైల్‌ క్రియేట్ చేసుకున్న శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్ట్‌ చేస్తున్న ‘మనమే’ చిత్రం ఆడియెన్స్‌ లో క్యూరియాసిటి క్రియేట్ అయ్యింది. ఈచిత్రం గురించి ఓ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది.


‘మనమే’ చిత్రం లో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ జోడిగా నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి మాళవిక నాయర్‌ ను సంప్రదించగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్త ఫిల్మ్‌ సర్కిల్‌లో వినిపిస్తోంది. యువి క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 12 న ప్రారంభమైంది.
శర్వానంద్ ఈ చిత్రం తో పాటు ప్రస్తుతం ‘లూజర్‌’ సినిమాకు సైన్‌ చేసాడు. అభిలాష్‌రెడ్డితో మరో సినిమాలోనూ శర్వానంద్‌ చేయనున్నాడు.

Related Posts